Trump: ట్రంప్ పగ: రష్యా, చైనాలతో పాటు భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు

Trump: చైనా అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెబుతూనే, పుతిన్, కిమ్‌లకు అభినందనలు. వారు అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు" అని ట్రంప్ ఆరోపించారు.

Trump

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Trump)మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. రష్యా, చైనా, ఉత్తర కొరియాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఆయన, భారత్‌తో ఉన్న వాణిజ్య సంబంధాలపైనా ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

చైనాపై ట్రంప్ (Trump)ఆగ్రహం..రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనాలో భారీ ఆయుధ ప్రదర్శన జరిగింది. బీజింగ్‌లోని తియానన్‌మెన్ స్క్వేర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సహా 26 దేశాల అగ్రనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు.

రెండో ప్రపంచ యుద్ధంలో చైనా కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమెరికన్ సైనికుల త్యాగాలను గుర్తించాలి. ఆ సమయంలో చైనాకు భారీగా మద్దతిచ్చాం. చైనా అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెబుతూనే, పుతిన్, కిమ్‌లకు అభినందనలు. వారు అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు” అని ట్రంప్ ఆరోపించారు.

Trump

భారత్‌తో వాణిజ్య సంబంధాలపై కామెంట్స్..ఇదే సమయంలో, భారత్‌తో అమెరికా సంబంధాలపై కూడా ట్రంప్ స్పందించారు. ఓవల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత్ తమ ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తోందని ఆరోపించారు.

మేము భారత దేశంతో కలిసి ఉన్నాం. అయితే, మన రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయి. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పరిస్థితిని మార్చాను. భారత్ మా దిగుమతులపై ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తోంది. మా ఉత్పత్తులపై 100 శాతం పన్నులు వేస్తున్నందువల్ల, హార్లే-డేవిడ్సన్ లాంటి కంపెనీలు భారత్‌లో ప్లాంట్లు ఏర్పాటు చేసి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని ట్రంప్ అన్నారు.

ప్రస్తుతం భారత్‌తో అమెరికా పెద్దగా వ్యాపారం చేయడం లేదని, కానీ భారత్ మాత్రం అమెరికాతో వ్యాపారం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. మరి ట్రంప్(Trump) చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా రాజకీయ, ఆర్థిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.

Heart attack: యువతలో గుండెపోటు మరణాలు..కారణాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Exit mobile version