Trump
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump)మరోసారి భారత్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో అమెరికా వాణిజ్య సంబంధం పూర్తిగా “ఏకపక్ష విపత్తు (one-sided disaster)” అని ఆయన అభివర్ణించారు. రష్యా, చైనాలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన భారత దిగుమతులపై 50% సుంకాలు విధించడాన్ని సమర్థించుకున్నారు.
ట్రంప్ (Trump)తన వ్యాఖ్యలలో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు.భారతదేశం అమెరికా వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ ఆరోపించారు. దీనివల్ల అమెరికన్ వ్యాపారాలు భారత్‌లో తమ వస్తువులను అమ్ముకోలేకపోతున్నాయని ఆయన అన్నారు. దీనివల్లే భారత్-అమెరికా వాణిజ్య సంబంధం ఏకపక్షంగా మారిందని, భారత్ అమెరికాకు ఎక్కువ వస్తువులు అమ్ముతూ, తక్కువ కొనుగోలు చేస్తోందని ఆయన విమర్శించారు.
Kavitha: బీఆర్ఎస్‌లో అంతర్గత యుద్ధం..ఆ ఇద్దరినీ టార్గెట్ చేసిన కవిత
భారతదేశం తమ చమురు, రక్షణ ఉత్పత్తుల కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడుతుందని, అమెరికా నుంచి చాలా తక్కువగా కొనుగోలు చేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. దీనిని ఆయన అమెరికాకు వ్యతిరేకంగా చూసినట్లు కనిపిస్తోంది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా భారత్‌పై 50% సుంకాలు విధించారు. ఈ సుంకాలలో రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేసినందుకు 25% జరిమానా కూడా ఉంది. అయితే, ట్రంప్ ఈ సుంకాలు విధిస్తున్న సమయంలోనే, సుంకాలు తగ్గించడానికి భారత్ సిద్ధమైందని, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఆయన వ్యాఖ్యానించారు.
ట్రంప్(Trump) చర్యలపై భారత్ మాత్రం వెనక్కి తగ్గలేదు. పాశ్చాత్య దేశాలు కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయని గుర్తు చేస్తూ, ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని, దేశ ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గబోమని భారత్ తేల్చి చెప్పింది. ఈ సుంకాలను అన్యాయమైనవి, అసమంజసమైనవిగా భారత్ అభివర్ణించింది.
ట్రంప్(Trump) విధించిన సుంకాలు దాదాపు 48 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ వస్తువులపై ప్రభావం చూపాయి. విలువైన రత్నాలు, వస్త్రాలు, రొయ్యలు వంటి వస్తువుల ఎగుమతులు దెబ్బతిన్నాయి. అయినా కూడా, భారత్ ట్రంప్ వ్యాఖ్యలపై మౌనంగా ఉంది. సుంకాల వల్ల ప్రభావితమైన కంపెనీలకు, రంగాలకు సహాయం అందించడం, ఇతర దేశాలతో కొత్త వాణిజ్య సంబంధాలు నెలకొల్పడంపై దృష్టి సారించింది. సుమారు 40 దేశాలతో చర్చలు జరుపుతూ, ఎగుమతి మార్కెట్లను విస్తరించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
Bathukamma: పూల పండుగకు వేళాయే..ఈనెల 22 నుంచి బతుకమ్మ వేడుకలు
ట్రంప్ వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ ఆరోపణలు మాత్రమే కాకుండా, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు ఎంత క్లిష్టంగా మారాయో చూపిస్తున్నాయి. భారత్ తన దేశ ప్రయోజనాలను కాపాడుకుంటూ, ఈ సవాళ్లను అధిగమించడానికి సిద్ధంగా ఉంది.