America:వణుకుతున్న అగ్రరాజ్యం అమెరికా.. 10 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

America: టెన్నెస్సీ, జార్జియా, మేరిల్యాండ్,వెస్ట్ వర్జీనియా, ఆర్కాన్సాస్, కెంటకీ, లూసియానా, మిసిసిపి, నార్త్ కరోలినా, ఇండియానాలలో ఎమర్జెన్సీ ప్రకటించారు.

America

అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి ప్రకోపిస్తోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ మంచు తుపాను (Winter Storm) దాటికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. పరిస్థితి తీవ్రతను గమనించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పది రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని (Emergency Declaration) ప్రకటించారు. టెన్నెస్సీ, జార్జియా, మేరిల్యాండ్,వెస్ట్ వర్జీనియా, ఆర్కాన్సాస్, కెంటకీ, లూసియానా, మిసిసిపి, నార్త్ కరోలినా, ఇండియానాలలో ఎమర్జెన్సీ ప్రకటించారు.

టెన్నెస్సీ, జార్జియా, నార్త్ కరోలినా వంటి రాష్ట్రాల్లో మంచు బీభత్సం సృష్టిస్తోంది. అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ స్థాయికి పడిపోవడంతో రోడ్లన్నీ మంచుతో కప్పబడ్డాయి. మంచు ఎక్కువగా కురుస్తుండటంతో సుమారు 14,800కు పైగా విమానాలు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు ప్రధాన విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు.

కేవలం విమానాలే కాదు, హైవేలపై ప్రయాణించడం కూడా ప్రమాదకరంగా మారడంతో చాలా మార్గాలను అధికారులు మూసివేశారు. గాలివానతో కూడిన చలి వల్ల హైపోథర్మియా వంటి ప్రాణాపాయ స్థితి తలెత్తే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

అయితే అమెరికా(America)లో ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు, కానీ తుపాను తీవ్రత ఈసారి సుమారు 2,000 మైళ్ల మేర విస్తరించి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో 2021లో టెక్సాస్‌లో వచ్చిన ‘ఉరి’ (Uri) మంచు తుపాను వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు .అలాగే లక్షలాది ఇళ్లకు విద్యుత్ నిలిచిపోయింది.

America

అంతకుముందు 1993లో వచ్చిన ‘స్టార్మ్ ఆఫ్ ది సెంచరీ’ కూడా ఇలాగే అమెరికా(America)ను గడగడలాడించింది. అమెరికాలో భౌగోళిక పరిస్థితుల వల్ల ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చే చల్లని గాలులు ఎటువంటి అడ్డంకులు లేకుండా మైదాన ప్రాంతాలకు చేరుకుంటాయి. దీనివల్లే తరచుగా ఇటువంటి మంచు తుపానులు సంభవిస్తుంటాయి. ప్రస్తుతం దక్షిణ రాష్ట్రాల్లో వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, గడ్డకట్టే చలిలో ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హోంల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరిస్తోంది.

Kalbelia:ప్రపంచం మెచ్చిన కళాకారులు..చనిపోతే ఆరడుగుల భూమికి నోచుకోని నిర్భాగ్యులు ..ఇంతకీ వాళ్లెవరు?

Exit mobile version