Reels:రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? మీకు తెలీకుండానే మీ మెదడులో జరుగుతుంది ఇదే..

Reels: రీల్స్ చూస్తూ టైమ్ ఎలా గడిచిపోతుందో కూడా తెలియని పరిస్థితిలో పడిపోతున్నారు అంతా.

Reels

ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరినీ తమకు తెలీకుండానే వేధిస్తున్న సమస్య రీల్స్ , షార్ట్ వీడియోల వ్యసనం. 15 నుంచి 60 సెకన్ల పాటు ఉండే ఈ వీడియోలు మనల్ని ఎంతగా ఆకర్షిస్తున్నాయంటే, గంటల తరబడి సమయం అలా రీల్స్ చూస్తూ టైమ్ ఎలా గడిచిపోతుందో కూడా తెలియని పరిస్థితిలో పడిపోతున్నారు.

అయితే, ఈ అలవాటు మనిషి మెదడుపై , ఏకాగ్రత (Attention Span) పై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. కేవలం క్షణాల్లో మారే దృశ్యాలకు మన మెదడు అలవాటు పడిపోతూ ఉండటం వల్ల, నిజ జీవితంలో ఓపిక అనేది నశించిపోతోందట.

మనం ఒక రీల్ చూసినప్పుడు మన మెదడులో ‘డోపమైన్’ అనే రసాయనం వేగంగా రిలీజవుతుంది. ఇది మనుషులకు తక్షణ ఆనందాన్ని ఇస్తుంది. కానీ, ప్రతి 15 సెకన్లకు ఒక కొత్త వీడియో చూస్తూ ఉండటం వల్ల మనిషి మెదడుకు తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం తీసుకునే అలవాటు అవుతుంది.

దీనివల్ల మనం ఏదైనా పుస్తకం చదవాలన్నా చివరకు మన జీవితంలో జరిగే ఏదైనా విషయం గురించి లోతుగా ఆలోచించాలన్నా మెదడు సహకరించదు. ఎందుకంటే ఆ పనుల్లో తక్షణ ఆనందం ఉండదు. దీనినే ‘గోల్డ్ ఫిష్ ఎఫెక్ట్’ అని పిలుస్తారని సైకాలజిస్టులు అంటున్నారు. అంటే మన ఏకాగ్రత నిమిషాల నుంచి సెకన్లకు పడిపోవడం.

ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని సైకాలజిస్టులు చెబుతున్నారు. చదువుపై దృష్టి పెట్టలేకపోవడం, త్వరగా విసుగు చెందడం వంటివి ఈ షార్ట్ వీడియోలు, రీల్స్(Reels) వల్లే జరుగుతున్నాయని అంటున్నారు.

Reels

దీని నుంచి బయటపడాలంటే మన ఏకాగ్రతను మళ్లీ తిరిగి సంపాదించుకోవాలి. రోజులో కొంత సమయం మాత్రమే సోషల్ మీడియాకు కేటాయించాలి. రీల్స్(Reels) చూడటం కంటే లాంగ్ వీడియోలు చూడటం , పుస్తకాలు చదవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.రీల్స్ చూసే సమయాన్ని పనికి వచ్చే విషయాల మీదకు మళ్లించాలి. దీనివల్ల మెదడుకు నిలకడ అలవడుతుంది.

మొత్తంగా టెక్నాలజీ మనల్ని కంట్రోల్ చేయకూడదు, మనమే టెక్నాలజీని కంట్రోల్ చేయాలన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ షార్ట్ వీడియోల మాయ నుంచి బయటకు రావాలి అని గట్టిగా ప్రయత్నించాలి.

Vasant Panchami:రేపే వసంత పంచమి.. సరస్వతీ దేవి కటాక్షం కోసం ఇలా చేయండి..

Exit mobile version