Jaggery Jalebi: ఆత్మకూరు బెల్లం జిలేబీ .. రాయలసీమ తియ్యటి రుచి

Jaggery Jalebi: త్మకూరు వెళ్లే దారిలో శ్రీశైలం వెళ్లే భక్తులు ఇక్కడ ఆగి ఈ జిలేబీలను తప్పకుండా కొనుక్కుని తినడమే కాదు వారి ఇళ్లకు తీసుకుని వెళతారు.

Jaggery Jalebi

మన తెలుగు రాష్ట్రాల్లో జిలేబీ (Jaggery Jalebi)అంటే అందరికీ ఇష్టమే, కానీ రాయలసీమ ప్రాంతంలోని నంద్యాల జిల్లా ఆత్మకూరులో దొరికే ‘బెల్లం జిలేబీ’ రుచి చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా హోటళ్లలో పంచదార పాకంతో చేసే జిలేబీలు(Jaggery Jalebi) దొరుకుతాయి.

కానీ ఆత్మకూరులో మాత్రం కేవలం స్వచ్ఛమైన తాటి బెల్లం లేదా చెరకు బెల్లంతో జిలేబీలను తయారు చేస్తారు. ఈ జిలేబీ తయారీ వెనుక దశాబ్దాల చరిత్ర ఉంది. దీని రుచి చూడటానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి పర్యాటకులు వస్తుంటారంటేనే దీని క్రేజ్, టేస్ట్ అర్ధం చేసుకోవచ్చు.

ఈ జిలేబీ కేవలం తీపి పదార్థం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదని ఇక్కడి వారు నమ్ముతారు. ఎందుకంటే ఇందులో పంచదార వాడరు కాబట్టి దీనివల్ల కలిగే ప్రయోజనాలు వేరుగా ఉంటాయి.

ఆత్మకూరు బెల్లం జిలేబీ తయారీ విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా మినపప్పు ,కొంచెం బియ్యం పిండిని కలిపి ఒక రోజంతా నానబెట్టి పులియబెడతారు. మరుసటి రోజు ఆ పిండిని ఒక గుడ్డలో వేసి, వేడివేడి నూనెలో లేదా నేతిలో జిలేబీ ఆకారంలో చుడతారు. ఇక్కడి వరకు అంతా మామూలే అయినా, అసలైన మ్యాజిక్ పాకంలో ఉంటుంది.

Jaggery Jalebi

మరిగే బెల్లం పాకంలో యాలకుల పొడి కలిపి, వేయించిన జిలేబీలను అందులో వేస్తారు. ఆ జిలేబీలు బెల్లం పాకాన్ని పీల్చుకుని, ఎర్రటి రంగులోకి మారతాయి. ఇవి పంచదార జిలేబీల్లాగా మెత్తగా ఉండవు, పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా ఉంటాయి. ఆ బెల్లం ఫ్లేవర్ మన నోటికి తగిలినప్పుడు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం.

ఈ జిలేబీలకి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇవి మూడు,నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఆత్మకూరు వెళ్లే దారిలో శ్రీశైలం వెళ్లే భక్తులు ఇక్కడ ఆగి ఈ జిలేబీలను తప్పకుండా కొనుక్కుని తినడమే కాదు వారి ఇళ్లకు తీసుకుని వెళతారు.

బెల్లం జిలేబీలు కేవలం రుచికరమైనవే కాదు, ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకు కూడా చాలా మంచిది. ప్రస్తుతం ఈ జిలేబీలు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకునేంత ఫేమస్ అయ్యాయి.

రాయలసీమ రుచులలో ఈ ఆత్మకూరు బెల్లం జిలేబీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వైపు వెళ్తే ఈ అద్భుతమైన రుచిని అస్సలు మిస్ అవ్వకండి.

Malai Ghevar: రాజస్థానీ రాయల్ స్వీట్ మలై ఘెవర్ ..జీవితంలో ఒక్కసారైనా టేస్ట్ చూడాల్సిందేనట..

Exit mobile version