Pets :కుక్కలకు, పిల్లలకు బేకరీలు,సెలూన్లు..పెట్ కేర్ బిజినెస్‌ ఇన్ని కోట్లు కురిపిస్తుందా?

Pets :మనుషులు తినే కేకుల్లో షుగర్, మైదా ఉంటాయి.. ఇవి మూగజీవాలకు ఏ మాత్రం పడవు.

Pets

ఒకప్పుడు ఇంట్లో కుక్క ఉందంటే దానికి మిగిలిపోయిన అన్నమో, బ్రెడ్ ముక్కో వేసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. నా కుక్కకు బర్త్‌డే.. దానికి స్పెషల్ కేక్ కావాలనో, నా పిల్లికి హెయిర్ కట్ చేయించాలి.. స్పా ఎక్కడ ఉందని వెతికే ‘పెట్ పేరెంట్స్’ (Pawrents) ఎక్కువగా పెరిగిపోయారు. భారత దేశంలో పెట్ కేర్ మార్కెట్ సుమారు రూ. 8,000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్ల స్థాయికి చేరుకుందంటే ఇది ఏ రేంజ్‌కు చేరుకుందో అర్దం చేసుకోవచ్చు.

మనుషులు తినే కేకుల్లో షుగర్, మైదా ఉంటాయి.. ఇవి మూగజీవాలకు ఏ మాత్రం పడవు. అందుకే పెట్ బేకరీలు పుట్టుకొచ్చాయి. ఇక్కడ చికెన్, క్యారెట్, గుమ్మడికాయ, ఓట్స్ వంటి వాటితో పప్పీలకు నచ్చే రకరకాల కేకులు, బిస్కెట్లు తయారు చేస్తారు. ఒక్కో కేక్ ధర 500 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా, తమ పెంపుడు జంతువుల (Pets) బర్త్ డే వేడుకల కోసం.. వేలల్లో ఖర్చు చేయడానికి పెట్ లవర్స్ ఏమాత్రం వెనకాడటం లేదు.

ఇక పెంపుడు జంతువుల(Pets) అందం కోసం కూడా స్పెషల్ సెలూన్లు కూడా వెలిశాయి. నెయిల్ కటింగ్, హెయిర్ ట్రిమ్మింగ్, మెడికేటెడ్ బాత్ , పెర్ఫ్యూమ్ కొట్టడం.. ఇలా ఒక్కో సెషన్‌కు 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో అయితే కొద్దిరోజులుగా విపరీతమైన డిమాండ్ ఉన్న బిజినెస్ లుగా మారిపోయాయి. కొంతమంది అయితే ఏకంగా మొబైల్ వ్యాన్‌లను ఏర్పాటు చేసి ఇంటి వద్దకి వచ్చి మరీ సర్వీస్ ఇస్తున్నారు.

Pets

పెట్ ఇండస్ట్రీలో లాభాల శాతం (Profit Margin) మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఒక పెట్ ఫుడ్ డిస్ట్రిబ్యూటర్ లేదా షాప్ యజమానికి 15 నుంచి 20 శాతం వరకూ లాభం ఉంటుంది. సగటున ఒక పెట్ పేరెంట్ తన పెంపుడు జంతువు ఫుడ్, హెల్త్, గ్రూమింగ్ కోసం నెలకు ఎంతలేదన్నా 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. 2028 నాటికి ఈ పెట్ కేర్ ఇండస్ట్రీ 10,000 కోట్లు రూపాయలు దాటుతుందని అంచనా.

జంతువుల మీద వారి ప్రేమను తమ వ్యాపారంగా మార్చుకోవడం అనేది ఇప్పుడు ఒక స్మార్ట్ ఐడియా. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పెట్ ఇన్సూరెన్స్, ఆన్‌లైన్ వెటర్నరీ కన్సల్టేషన్ వంటి సర్వీసులు కూడా తోడవుతున్నాయి. అందుకే ఒక చిన్న ఇన్వెస్ట్‌మెంట్ తో మంచి బిజినెస్ చేయాలనుకుంటే, ఈ ‘పెట్ కేర్’ రంగం ఒక బంగారు బాతు వంటిదని చెప్పొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version