Sleep
మనిషికి ఎన్ని పనులున్నా రాత్రి కాసేపు హాయిగా నిద్రపోతే చాలనుకుంటాను. అటు అలసట పోవడమే కాకుండా బాడీ కూడా రీఛార్జ్ అవడానికి నిద్ర అవసరం అని డాక్టర్లు కూడా చెబుతుంటారు. అందుకే ఇప్పుడు అందరికీ నిద్ర( Sleep) ఒక ఖరీదైన విలాసంగా మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఆరుబయట అయినా ఆదమరిచి నిద్రపోయే తరం నుంచి .. మారిన లైఫ్ స్టైల్‌తో ఏసీలు, సెపరేట్ రూమ్‌లు, స్పెషల్ మంచాలు, పరుపులు, చివరకు స్పెషల్ పిల్లోలు ఉన్నా కూడా ఇప్పటివారికి నిద్ర కరవవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులు ఏటా లక్షల కోట్లు ప్రశాంతమైన నిద్ర( Sleep) కోసమే ఖర్చు చేస్తున్నారట. దీనిని ఆర్థిక నిపుణులు స్లీప్ ఎకానమీ అని పిలుస్తున్నారు. 2026 చివరికి ఈ బిజినెస్ విలువ దాదాపు 70 బిలియన్ డాలర్లకు పైగా చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కేవలం మంచి పరుపులు, దిండ్లు అమ్మడమే కాకుండా, స్లీప్ టెక్నాలజీ ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రీగా అవతరించింది అంటేనే.. ఒకప్పుడు నిద్ర అనే నేచురల్ ప్రక్రియను ఇప్పుడు కొనుగోలు చేయాల్సిన వస్తువుగా మార్చుకున్నామన్న సంగతి ఈజీగా అర్ధం చేసుకోవచ్చు.
ఇవే కాదు నిద్ర నాణ్యతను తెలుసుకోవడానికి స్మార్ట్ వాచ్‌లు, స్లీప్ ట్రాకింగ్ రింగులు , సబ్‌స్క్రిప్షన్ బేస్‌డ్ మొబైల్ యాప్స్ కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు.. మెదడును కూల్ చేసే వైట్ నాయిస్ మెషీన్లు, నిద్రలో గురకను అరికట్టే స్మార్ట్ మాస్క్‌లు, బాడీ టెంపరేచర్‌ను బట్టి అడ్జస్ట్ అయ్యే ఏసీలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. టెన్షన్స్‌తో కూడిన లైఫ్ స్టైల్, బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ వల్ల వచ్చే నిద్రలేమిని క్యాష్ చేసుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు సరికొత్త ‘స్లీప్ ప్యాకేజీల’ను ప్రకటిస్తున్నాయి. గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా స్లీప్ డేటా విశ్లేషణపై స్పెషల్ ఫోకస్ పెంచాయి.
అటు హోటల్ పరిశ్రమలో కూడా స్లీప్ టూరిజం అనే కొత్త కాన్సెప్ట్ ఒకటి ఎంట్రీ ఇచ్చింది. దీంతో కేవలం పీస్‌పుల్‌గా నిద్రపోవడానికే కొన్ని ప్రత్యేక రిసార్టులకు వెళ్లే ధనికుల సంఖ్య పెరుగుతోంది. అక్కడ వారికి మెడిటేషన్, స్పెషల్ డైట్ తో పాటు నిద్రను ప్రేరేపించే వాతావరణాన్ని కల్పిస్తారు.
మరోవైపు నిద్రలేమి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలనుంచి భయంతో ప్రజలు రకరకాల మందులు, హెర్బల్ టీలు, మెలటోనిన్ సప్లిమెంట్లకు అలవాటు పడుతున్నారు. ప్రశాంతమైన నిద్ర అనేది ఇప్పుడు కేవలం ఒక ఆరోగ్యకరమైన సూత్రం మాత్రమే కాదు, ప్రపంచాన్ని శాసిస్తున్న అతిపెద్ద అలాగే చాలా ఫాస్టుగా వృద్ధి చెందుతున్న బిజినెస్ సీక్రెట్ అయిపోయింది. మనిషి తన అలసటను తీర్చుకుని ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా ఇంత పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించాల్సి రావడం విషాదం అనే చెప్పాలి.
