Coriander Water : పరగడుపున ధనియాల నీళ్లు.. థైరాయిడ్ కంట్రోల్ అవుతుందా?

Coriander Water : పరగడుపున ధనియాల నీళ్లు తాగడం చిట్కాను తెగ ఫాలో అయిపోతున్నారు

Coriander Water

ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతోనే దీనికి తగినట్లుగా అనేక రకాల ఇంటి చిట్కాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అందులో ఉదయాన్నే పరగడుపున ధనియాల నీళ్లు(Coriander Water) తాగడం చిట్కాను తెగ ఫాలో అయిపోతున్నారు చాలామంది.

అసలు ఈ ధనియాల నీళ్లు(Coriander Water) తాగడం వల్ల థైరాయిడ్ నిజంగానే కంట్రోల్ అవుతుందా అన్న ప్రశ్న చాలామందిలో ఉంది. ఆయుర్వేదం చెబుతున్న దాని ప్రకారం.. ధనియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు , ఖనిజాలు శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో సహాయపడతాయట. ముఖ్యంగా ధనియాల నీరు శరీరంలోని మెటబాలిజం రేటును పెంచి, థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరుస్తుందని చెబుతారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ధనియాల నీళ్లు తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోవడమే కాకుండా (Detoxification), జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో తరచుగా కనిపించే వాపులు (Inflammation) , బరువు పెరగడం వంటి లక్షణాలను తగ్గించడంలో ధనియాలు బాగా తోడ్పడతాయి.

Coriander Water

ధనియాల నీటిని తయారు చేసుకోవడానికి ఒక చెంచా ధనియాలను తీసుకుని వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని మరిగించి వడకట్టుకుని తాగాలి. దీనివల్ల థైరాయిడ్ నియంత్రణలో ఉండటమే కాకుండా కొలెస్ట్రాల్ తగ్గడానికి , కిడ్నీల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు.అయితే ఇది కేవలం సహాయకారిగా మాత్రమే పనిచేస్తుందని, డాక్టర్లు సూచించిన మందులను ఆపకూడదని గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Mana Shankar Varaprasad Garu:మన శంకర్ వరప్రసాద్ గారు.. ప్రీమియర్ షోల టైమింగ్స్, టికెక్ ధరల డిటైల్స్

 

Exit mobile version