Social media:సోషల్ మీడియా .. మన మెదడును ఎలా మారుస్తుందో తెలుసా?

Social media:సోషల్ మీడియా యాప్‌లు మన మెదడును త్వరగా రివార్డ్ పొందేలా చేస్తాయి. దీనివల్ల మనలో ఏకాగ్రత తగ్గి, చిన్న విషయాలకే విసుగు చెందుతాం

Social media

సోషల్ మీడియా(Social media) ఇప్పుడు మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్( ఎక్స్) వంటి ప్లాట్‌ఫారమ్‌లు మన స్నేహితులను, బంధువులను, కొత్త వ్యక్తులను కలుపుతాయి, కానీ అవి మన మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత , వ్యక్తిగత సంబంధాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియాలో చూసే వీడియోలు ప్రభావితం చేస్తాయి. పరిపూర్ణమైన జీవితాలు, సెలబ్రిటీల పోస్ట్‌లు మనలో అసూయ, ఒంటరితనం, నిరాశకు దారితీస్తాయి. ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.

సోషల్ మీడియా యాప్‌లు మన మెదడును త్వరగా రివార్డ్ పొందేలా చేస్తాయి. దీనివల్ల మనలో ఏకాగ్రత తగ్గి, చిన్న విషయాలకే విసుగు చెందుతాం. ఒక పనిపై ఎక్కువ సమయం ఫోకస్ చేయలేకపోతాం. నోటిఫికేషన్‌లు, అప్‌డేట్‌లు మన మెదడును నిరంతరం డిస్ట్రాక్ట్ చేస్తాయి.

Social media

వ్యక్తిగత సంబంధాలు..సోషల్ మీడియా మనకు వేలాది మందితో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. కానీ ఇది నిజమైన, లోతైన సంబంధాలను తగ్గిస్తుంది. మనం వ్యక్తిగతంగా కలుసుకుని మాట్లాడుకోవడం కన్నా, ఫోన్‌లో గడిపే సమయం ఎక్కువ అవుతుంది.

అయితే సోషల్ మీడియాలో కొన్ని సానుకూల ప్రభావాలు కూడా ఉన్నాయి. ఇది సమాచారాన్ని త్వరగా వ్యాప్తి చేయడంలో సహాయపడుతుంది, సమాజంలో మంచి మార్పులకు కారణమవుతుంది. అయితే, దానిని ఎంత వాడాలో, ఎలా వాడాలో తెలుసుకోవడం ముఖ్యం.

Credit card: క్రెడిట్ కార్డ్ వాడేవాళ్లకి షాక్.. ఇక రెంట్ పేమెంట్స్ బంద్

 

Exit mobile version