Just BusinessJust NationalLatest News

Credit card: క్రెడిట్ కార్డ్ వాడేవాళ్లకి షాక్.. ఇక రెంట్ పేమెంట్స్ బంద్

Credit card: క్రెడిట్ కార్డు నుంచి ఇంటి రెంట్ కూడా చెల్లించే ఆప్షన్ వచ్చింది. దీంతో పలువురికి రెంట్ కట్టుకుని తీరిగ్గా 45 రోజుల తర్వాత చెల్లింపు చేసుకుంటున్నారు.

Credit card

క్రిడిట్ కార్డ్.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ కామన్ అవసరంగా మారిపోయింది. కరోనా తర్వాత వచ్చిన పరిణామాలతో క్రెడిట్ కార్డ్ వినియోగం ఓ రేంజ్ లో పెరిగిపోయింది. జీతం టైమ్ కు అందనప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉండేందుకే క్రెడిట్ కార్డును ఒకప్పుడు వాడుకునేవారు. కానీ రానురానూ ఖర్ఛులు పెరిగిపోవడంతో క్రెడిట్ కార్డులను ఇష్టానుసారంగా వాడేస్తున్నారు.

కొంతకాలంగా క్రెడిట్ కార్డు (credit card)నుంచి ఇంటి రెంట్ కూడా చెల్లించే ఆప్షన్ వచ్చింది. దీంతో పలువురికి రెంట్ కట్టుకుని తీరిగ్గా 45 రోజుల తర్వాత చెల్లింపు చేసుకుంటున్నారు. అయితే కొందరు దీనిని క్యాష్ చేసుకుంటుండడంతో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ చెల్లింపు ఆప్షన్ ఆపేయాలని ఫిన్ టెక్ సంస్థలకు ఆదేశాలిచ్చింది. ఎందుకంటే రెంట్ పేమెంట్ ఆప్షన్ ను ఉపయోగించుకుని చాలా మంది నగదుగా మార్చుకుంటున్నారు. ఇంటి ఓనర్ పేరుతో వేరే అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసి అక్కడ నుంచి నగదు తీసుకుంటున్నారు.

ఇంటి అద్దె చెల్లింపు ఆప్షన్ ను ఉపయోగించుకుని ఇలా డబ్బు తీసుకుంటున్నట్టు బ్యాంకులు గతంలోనే గుర్తించాయి. దీనిని అరికట్టేందుకు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు రెంట్ పేమెంట్స్ పై 1 శాతం ఫీజును కూడా విధించాయి.అదే సమయంలో క్రెడిట్ కార్డు (credit card)వినియోగదారులకు ఇచ్చే క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ వంటి వాటిని నిలిపివేశాయి. అదే సమయంలో ఈ దుర్వినియోగాన్ని కనిపెట్టిన కొన్ని ఫిన్ టెక్ సంస్థలు ( పేటీఎం , క్రెడ్, ఫోన్ పే ) ఆ ఆప్షన్ ను తాత్కాలికంగా ఆపేశాయి.

credit card
credit card

కొన్ని కొత్త కేవైసీ రూల్స్ తో మళ్లీ మొదలుపెట్టినా ఆర్బీఐ తాజా ఆదేశాలతో అవి కూడా నిలిచిపోనున్నాయి. ఈ తరహా చెల్లింపులకు సంబంధించి పై పేమెంట్‌ గేట్‌వేలపై ఆర్బీఐ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఫిన్ టెక్ సంస్థలతో నేరుగా సంబంధం లేని వారికి ఈ ట్రాన్సాక్షన్స్ చేయకూడదని స్పష్టం చేసింది. కేవలం రిజిస్టర్ అయి కేవైసీ పూర్తి చేసుకున్న మర్చంట్లకు మాత్రమే చెల్లింపులు చేసుకునేలా ఆదేశాలిచ్చింది.

ఆర్బీఐ తాజా ఆదేశాలతో క్రెడిట్ కార్డు(credit card) ద్వారా రెంట్ పేమెంట్స్ చేసేవారు కొత్త ఆప్షన్స్ వెతుక్కోవాల్సిందే. ఎందుకంటే క్రెడిట్ కార్డులను నార్మల్ గా వాడుకునే వారికంటే కూడా చాలా మంది నగదు తీసుకునేందుకే వాడుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున వ్యాపారం కూడా జరుగుతోంది. 10 వేలకు 3శాతం కమీషన్ తీసుకుని కొందరు డబ్బులు ఇస్తున్నారు. వీటి కోసం ఏకంగా ఫేక్ బిజినెస్ లను క్రియేట్ చేసి స్వైపింగ్ మెషీన్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిని అరికట్టే ఉద్దేశంలో భాగంగానే ఆర్బీసీ రెంట్ పేమెంట్ ఆప్షన్ ను నిలిపివేసేలా నిర్ణయం తీసుకుంది.

Tirumala : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, గదుల కోటా విడుదల షెడ్యూల్ ఇదే!

Related Articles

Back to top button