OCD:ఓసీడీని లైట్ తీసుకోకండి..అది ఒక మానసిక వ్యాధి

OCD: మెదడులోని సెరోటోనిన్ అనే రసాయనంలో అసమతుల్యత వల్ల OCD వస్తుంది. అలాగే, కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఇతరులకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

OCD

మీరు ఇంటికి తాళం వేసి బయలుదేరుతారు. కానీ, కొద్ది నిమిషాలకే “నిజంగా తాళం వేశానా?” అనే అనుమానం మనసులో మొదలవుతుంది. మీకు తెలుసు, మీరు వేశారని. అయినా మనసు మాట వినదు, మిమ్మల్ని మళ్లీ వెనక్కి వెళ్లేలా బలవంతం చేస్తుంది. ఇలా ఒకసారి కాదు, రెండు, మూడు సార్లు పదే పదే అదే పని చేస్తారు. ఇది కేవలం ఒక అలవాటు కాదు, ఆబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD) అనే ఒక తీవ్రమైన మానసిక సమస్య. ఇది ఒక వ్యక్తిని ఆలోచనల వలలో బందీ చేసి బతికేలా చేస్తుంది.

ఈ సమస్యలో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. మొదటిది ఆబ్సెషన్స్ (Obsessions). ఇవి మనసులో బలవంతంగా, పదే పదే వచ్చే ఆలోచనలు లేదా చిత్రాలు. అవి చాలా అసంబద్ధంగా లేదా భయానకంగా అనిపించినా, వాటిని ఆపడం రోగికి సాధ్యం కాదు. ఉదాహరణకు నా చేతులు మురికిగా ఉన్నాయి, నాకు రోగాలు వస్తాయి.నేను ఎవరికైనా హాని చేస్తానేమో.ఏదైనా భయంకరమైన తప్పు జరిగిపోతుందేమో.ఈ ఆలోచనలు రోగికి తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన కలిగిస్తాయి.

రెండోది కంపల్షన్స్ (Compulsions). ఆబ్సెసివ్ ఆలోచనల వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోగి పదే పదే చేసే పనులే కంపల్షన్స్. ఇది తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినా, అది ఒక వలయంలా మళ్లీ కొనసాగుతుంది. ఉదాహరణకు పదే పదే చేతులు కడుక్కోవడం..తాళం వేశారా, గ్యాస్ బంద్ చేశారా అని పదే పదే తనిఖీ చేయడం..వస్తువులను ఒక క్రమంలో, సరిగ్గా అమర్చడం…ఒకే ప్రార్థన లేదా ఒకే పదాన్ని పదే పదే ఉచ్చరించడం.

Also Read: Green chili: పచ్చిమిర్చి కారం కాదు.. కావాల్సినంత ఆరోగ్యం

వాటిని ఆపాలనుకున్నా అవి మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. ఈ ఆలోచనల వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోగి పదే పదే కొన్ని పనులను చేస్తారు, వీటినే కంపల్షన్స్ అంటారు. ఉదాహరణకు, గంటల తరబడి చేతులు కడుక్కోవడం, తాళం వేశారా లేదా అని పదే పదే చెక్ చేయడం, లేదా వస్తువులను ఒక క్రమంలో అమర్చడం వంటివి. ఈ పనులు తాత్కాలికంగా ఒత్తిడిని తగ్గిస్తాయి, కానీ కొద్దిసేపటికే ఆలోచనల వలయం మళ్లీ మొదలవుతుంది.

శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం, మెదడులోని సెరోటోనిన్ అనే రసాయనంలో అసమతుల్యత వల్ల OCD వస్తుంది. అలాగే, కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఇతరులకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్ననాటిలో ఎదురైన మానసిక ఒత్తిడులు, బాధాకరమైన సంఘటనలు కూడా ఈ సమస్యను ప్రేరేపించవచ్చు.

ocd

OCD ఉన్నవారికి ఇది కేవలం ఒక అలవాటు కాదు.. ఇది వారి జీవితాన్ని పూర్తిగా ఎఫెక్ట్ చేస్తుంది. గంటల తరబడి చేసే పనుల వల్ల విలువైన సమయం వృథా అవుతుంది, ఇది ఉద్యోగం, చదువు కుటుంబ సంబంధాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ ఆలోచనలు అసంబద్ధమైనవి అని రోగికి పూర్తిగా తెలుసు, కానీ వాటిని ఆపలేని పరిస్థితికి చేరుకుంటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయితే, OCDకి చికిత్స అందుబాటులో ఉంది. వైద్యులు సాధారణంగా సెరోటోనిన్ స్థాయిలను సరిచేసే మందులను సిఫార్సు చేస్తారు. అలాగే, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) లో భాగంగా వచ్చే ఎక్స్‌పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ (ERP) అనే థెరపీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో రోగిని క్రమంగా భయపెట్టే పరిస్థితులకు గురిచేసి, వారు తమ కంపల్షన్స్ చేయకుండా అలవాటు చేస్తారు.

Exit mobile version