Dressing:వేసుకునే డ్రస్ మీ లుక్‌నే మార్చేస్తుంది..మీరూ ట్రై చేయండి..

Dressing: మగవాళ్లు తమ లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు .. ఎంతో స్టైలిష్ గా , కాన్ఫిడెంట్ గా కనిపించొచ్చు.

Dressing

కాస్ట్‌లీ బట్టలు వేసుకుంటేనే అందంగా కనిపిస్తామని చాలా మంది అనుకుంటారు. కానీ ఫ్యాషన్ అనేది బ్రాండ్ మీద, బట్టల రేటు మీద కాదు, మనం ఆ బట్టలను (Dressing) ఎలా క్యారీ చేస్తున్నామనే దాని మీద ఆధారపడి ఉంటుందంటారు ఎక్స్‌పర్ట్స్. మగవాళ్లు తమ లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు .. ఎంతో స్టైలిష్ గా , కాన్ఫిడెంట్ గా కనిపించొచ్చు.

అందులో మొదటి సూత్రం ఫిట్టింగ్. మీరు వేసుకునే డ్రెస్ మరీ లూజ్ గా ఉండకూడదు అలాగే మరీ టైట్ గా గానీ ఉండకూడదు. కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్న బట్టలు(Dressing) మిమ్మల్ని అందరిలో క్లాసీగా చూపిస్తాయి.

రెండోది కలర్ సెలక్షన్. మీ స్కిన్ టోన్‌కి ఏ కలర్స్ సెట్ అవుతాయో ముందు తెలుసుకోవాలి. ఎప్పుడూ ప్యాంట్ రంగు కంటే షర్ట్ రంగు కొంచెం లైట్ గా ఉంటే ఎప్పుడూ చూడటానికి బాగుంటుంది.

ఇక మూడోది ‘షూస్ అండ్ బెల్ట్’. ఫ్యాషన్ రూల్ ప్రకారం మీ బెల్ట్ రంగు , షూస్ రంగు ఒకేలా ఉండాలి.ఇది చాలామంది పట్టించుకోరు . కానీ దీని వల్ల కూడా మీ లుక్ మారుతుంది

Dressing

నాలుగోది బట్టల మెయింటెనెన్స్.. ముడతలు ఉన్న బట్టలు, నలిగిన బట్టలు(Dressing) వేసుకుంటే అది మీ నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది, కాబట్టి ఎప్పుడూ ఐరన్ చేసిన బట్టలు వేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి.

చివరిగా యాక్సెసరీస్.. చేతికి ఒక మంచి వాచ్ పెట్టుకోవడం మీ లుక్ ని కంప్లీట్ చేస్తుంది. అనవసరమైన జ్యువెలరీ తగిలించుకోకుండా సింపుల్ గా ఉంటేనే ఎక్కువ స్టైల్ గా కనిపిస్తారు. మరీ కావాలనుకుంటే సన్నని చైన్‌ను మెడలో వేసుకోండి.

చివరగా గుర్తుంచుకోవాల్సింది ఇంకోటుంది. ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ మీ లుక్‌నే కాదు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.

Nestle:నెస్లే బేబీ ఫుడ్‌లో విషం.. 31 దేశాల్లో ఉత్పత్తుల వెనక్కి.. భారత్‌లో పరిస్థితి ఏంటి?

Exit mobile version