Glasses:ఇక ఫోన్ చూడక్కర్లేదు కళ్లద్దాలతోనే అంతా..

Glasses: మ్యాప్స్ చూసేటప్పుడు ఫోన్ వైపు చూడకుండానే, మీరు వెళ్లాల్సిన దారిని ఈ గ్లాసెస్ నేరుగా రోడ్డుపైనే యారో మార్కులతో చూపిస్తాయి.

Glasses

టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల హవా జోరుగా నడుస్తోంది. కానీ, అతి త్వరలోనే మనమంతా ఫోన్లను జేబులోనే, బ్యాగులోనే ఉంచి, కేవలం కళ్లద్దాల ద్వారానే అన్ని పనులు చేసుకునే రోజులు వచ్చేసాయి. దీనిని ఏఐ స్మార్ట్ గ్లాసెస్’ (AI Smart Glasses) విప్లవం అని పిలుస్తున్నారు. మెటా (ఫేస్‌బుక్), గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు.. ఈ సరికొత్త టెక్నాలజీని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పటికే అడుగులు వేశాయి.

ఈ గ్లాసెస్ (Glasses) పెట్టుకుంటే చాలు, మన కళ్ల ముందే ఒక వర్చువల్ ప్రపంచం కనిపిస్తుంది. రోడ్డుపై నడుస్తున్నప్పుడు మనకు తెలియని భాషలో ఏదైనా బోర్డు కనిపిస్తే, ఈ గ్లాసెస్ దానిని వెంటనే మనకు నచ్చిన భాషలోకి ట్రాన్స్ లేట్ చేసి కళ్ల ముందే ప్రదర్శిస్తాయి.

ఈ ఏఐ గ్లాసెస్ (AI Glasses)కేవలం సమాచారాన్ని చూపించడమే కాకుండా, మనకు పర్సనల్ అసిస్టెంట్ లాగా పనిచేస్తాయి. ఉదాహరణకు, మీరు ఒక వ్యక్తిని కలిసినప్పుడు వారి పేరు మర్చిపోతే, ఈ గ్లాసెస్ వారి ముఖాన్ని గుర్తించి (Face Recognition) వారి వివరాలను మీకు సీక్రెట్‌గా చెబుతాయి.

అలాగే ఫోన్ కాల్స్ మాట్లాడటం, ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం వంటివి కూడా కేవలం ఒక చిన్న వాయిస్ కమాండ్ తో కానీ సైగలతో కానీ చేయొచ్చు. మ్యాప్స్ చూసేటప్పుడు ఫోన్ వైపు చూడకుండానే, మీరు వెళ్లాల్సిన దారిని ఈ గ్లాసెస్ నేరుగా రోడ్డుపైనే యారో మార్కులతో చూపిస్తాయి. ఇది డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా సేప్టీగా ఉంటుంది.

Glasses

భవిష్యత్తులో ఈ గ్లాసెస్(Glasses) స్మార్ట్‌ఫోన్లకు.. పూర్తి ప్రత్యామ్నాయంగా మారుతాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం వీటి ధర కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా, 2026 చివరి నాటికి ఇవి సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ టెక్నాలజీతో ప్రైవసీకి సంబంధించిన కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి.

ఎదుటివారికి తెలియకుండా ఫోటోలు తీయడం వంటి ఇబ్బందులు రాకుండా..ఈ కంపెనీలు ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లను యాడ్. ఏది ఏమైనా, మనం స్పెక్ట్స్ ద్వారా ప్రపంచాన్ని చూసే విధానం ఈ ఏఐ గ్లాసెస్‌తో పూర్తిగా మారిపోతుంది. డిజిటల్ ప్రపంచం ,భౌతిక ప్రపంచం మధ్య ఉన్న గీతను ఇవి చెరిపివేయబోతున్నాయి.

Garuda Purana:గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా ? అది అమంగళమా? శుభప్రదమా?

Exit mobile version