Plastic Containers
మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాస్ వంటిళ్లలో ప్లాస్టిక్ డబ్బాల వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్లాస్టిక్ డబ్బాలలో(Plastic Containers) నూనె పదార్థాలు లేదా పచ్చళ్లు నిల్వ చేసినప్పుడు, ఆ జిడ్డు ఎంత తోమినా సరే వదలదు.
అలాగే ఒకసారి వాడిన డబ్బాలో మరో వస్తువు వేయాలంటే ఆ పాత వాసన పోకపోవడం వల్ల ఆ డబ్బాలను పడేయలేం అలా అని వాడలేం అన్నట్లుగా ఇబ్బంది పడతాం. అయితే దీని కోసం గంటల తరబడి పదేపదే సబ్బుతో రుద్దాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క నిమిషంలో డబ్బాలను శుభ్రం చేసే ఒక క్రేజీ ట్రిక్ ఉందంటున్నారు ఎక్స్‌పర్ట్స్.. అదే టిష్యూ పేపర్ – షేక్ మెథడ్.
దీనికోసం ఒక మురికిగా ఉన్న లేదా వాసన వస్తున్న ప్లాస్టిక్ డబ్బాలో కొంచెం గోరువెచ్చని నీళ్లు పోయాలి. అందులో రెండు చుక్కల డిష్ వాష్ లిక్విడ్ , ఒక చిన్న ముక్క టిష్యూ పేపర్ ను ముక్కలు చేసి వేయాలి . ఇప్పుడు మూత పెట్టి ఆ డబ్బాను ఒక నిమిషం పాటు గట్టిగా అటు ఇటు షేక్ (Shake) చేయాలి.
దీంతో డబ్బా లోపల ఉన్న జిడ్డు మొత్తాన్నిత ఆ టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. ఆ తర్వాత ఆ నీళ్లను పారబోసి మామూలు నీళ్లతో కడిగేస్తే, డబ్బా కొత్త దానిలా మెరుస్తుంది.
ఒకవేళ డబ్బా నుంచి నూనె, పచ్చడి, అల్లంవెల్లుల్లి పేస్ట్ వంటి వాసన వస్తుంటే, అందులో కొంచెం బేకింగ్ సోడా లేదా నిమ్మరసం కలిపిన నీటిని ఒక గంట సేపు ఉంచితే ఎంతటి ఘాటైన వాసనయినా మాయమైపోతుంది. తర్వాత అప్పుడప్పుడూ ప్లాస్టిక్ డబ్బాలను ఎండలో ఆరబెట్టడం వల్ల బాక్టీరియా చనిపోయి తాజాగా ఉంటాయి.
