Gold Rates
కొద్దిరోజులుగా సామాన్యులకు ఓ రేంజ్‌లో చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు( Gold Rates) ఒక్కసారిగా దిగివచ్చాయి. ఈ వారం ఆరంభం నుంచి వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి రేట్లు, శుక్రవారం నాటికి ఊహించని విధంగా తగ్గుముఖం పట్టాయి.
నిన్నటి వరకు ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు( Gold Rates) ఇప్పుడు స్వల్పంగా తగ్గడంతో కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ ధరల తగ్గింపు మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటనిచ్చినట్లు అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావం స్థానిక మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం మన హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర లక్షా 54 వేల 300 రూపాయల వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే దీనిలో స్వల్ప మార్పు కనిపిస్తోంది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా లక్షా 41 వేల 440 రూపాయలకు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ , విశాఖపట్నం నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో మాత్రం ఇతర నగరాల కంటే కాస్త ఎక్కువగా లక్షా 54 వేల 900 రూపాయలుగా నమోదు అయింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర లక్షా 54 వేల 450 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ , చెన్నై నగరాల్లో కిలో వెండి ధర మూడు లక్షల 39 వేల 900 రూపాయల వద్ద కొనసాగుతోంది. నిన్నతో పోలిస్తే వెండిపై సుమారు వంద రూపాయల వరకు తగ్గుదల కనిపించింది. ఢిల్లీ , బెంగళూరులో కిలో వెండి ధర మూడు లక్షల 24 వేల 900 రూపాయలుగా ఉంది.
రెండు రోజుల్లోనే బంగారం ధరలు (Gold Rates) భారీగా పెరిగి, ఇప్పుడు మళ్లీ ధరలు తగ్గడంతో మార్కెట్లో సానుకూల వాతావరణాన్ని నింపింది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ ధరల్లో మరిన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.
