Flexitarian Diet :ఫ్లెక్సిటేరియన్ డైట్ పేరు విన్నారా? మన ఆరోగ్యానికే కాదు ప్రకృతికి కూడా ఇది మంచిదట

Flexitarian Diet : శాకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పీచు పదార్థం ఎక్కువగా అందుతుంది.

Flexitarian Diet

రోజురోజుకు అందరికీ ఆరోగ్యం పట్ల అవేర్నెస్ పెరుగుతూ ఉంది. అయితే అవగాహన పెరుగుతున్న కొద్దీ రకరకాల డైట్ ప్లాన్స్ కూడా అలాగే అందుబాటులోకి వస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా శాకాహారం వైపు చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు. అయితే, నాన్ వెజ్ పూర్తిగా మానేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారి కోసం పుట్టిందే ఈ ఫ్లెక్సిటేరియన్ డైట్.

దీని పేరులోనే ఉన్నట్లుగా ఇది చాలా ఈజీగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అంటే వారంలో ఐదు లేదా ఆరు రోజులు పూర్తిగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ ,మిల్లెట్స్ తీసుకుంటూ, ఎప్పుడైనా ఒక రోజు లేదా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాత్రం పరిమితంగా నాన్ వెజ్ ఫుడ్ తీసుకోవడం దీని ముఖ్య ఉద్దేశ్యం. దీనివల్ల శరీరంపై ఎటువంటి ఒత్తిడి కలగదు అలాగే మనకు ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం అసలే ఉండదు.

ఆరోగ్య పరంగా చూస్తే ఫ్లెక్సిటేరియన్ డైట్(Flexitarian Diet ) వల్ల అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. శాకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పీచు పదార్థం (Fiber) ఎక్కువగా అందుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, బ్లడ్ షుగర్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.

పరిశోధనల ప్రకారం, ఈ డైట్ పాటించే వారిలో గుండె జబ్బులు వచ్చే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. మాంసాహారం తగ్గించడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా ఉంటుంది అలాగే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ముఖ్యంగా వెయిట్ తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప మార్గం. లో-క్యాలరీ ఆహారం , మొక్కల ఆధారిత ప్రోటీన్లు తీసుకోవడం వల్ల నేచురల్‌గానే బరువు తగ్గుతారు. ఇది కేవలం బరువు తగ్గడానికే కాదు, టైప్-2 డయాబెటిస్ , క్యాన్సర్ వంటి జబ్బుల ముప్పును తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

Flexitarian Diet

పర్యావరణ కోణంలో కూడా ఫ్లెక్సిటేరియన్ డైట్ కు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మాంసాహార ఉత్పత్తి కోసం విపరీతమైన నీరు , వనరులు అవసరమవుతాయి.అలాగే పశువుల పెంపకం వల్ల గ్రీన్‌హౌస్ వాయువుల విడుదల కూడా ఎక్కువగా ఉంటుంది. మనం వారంలో కొన్ని రోజులు మాంసాహారం మానేయడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో మనవంతు పాత్ర పోషించిన వారం అవుతాము.

ఈ డైట్ పాటించడం వల్ల మన ఆహారపు అలవాట్లు రెగ్యులర్ అవుతాయి. ఇది ఒక కఠినమైన నియమంలా కాకుండా, మన ఇష్టానికి అనుగుణంగా మార్చుకోగలిగే లైఫ్ స్టైల్ కాబట్టి ఎక్కువ కాలం పాటించడానికి వీలవుతుంది. మన తెలుగు ఇంటి వంటకాల్లో కూడా పప్పులు, కూరగాయలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, మనకు ఈ డైట్ పాటించడం చాలా ఈజీ. ఆరోగ్యకరమైన సొసైటీ కోసం సుస్థిరమైన ఎన్విరాన్మెంట్ కోసం ఫ్లెక్సిటేరియన్ డైట్(Flexitarian Diet ) ను ఫాలో అవడం నిజంగా ఇప్పటి తరానికి అవసరమే.

Japanese:జపాన్‌ ప్రజల లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ సీక్రెట్ ఇదేనట.. మీరూ ట్రై చేయండి..

 

Exit mobile version