Just InternationalHealthJust LifestyleLatest News

Japanese:జపాన్‌ ప్రజల లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ సీక్రెట్ ఇదేనట.. మీరూ ట్రై చేయండి..

Japanese: మీకు ఇష్టమైన పనేంటి? మీరు ఏ పనిలో నిపుణులు? ప్రపంచానికి మీ నుంచి ఏం అవసరం? మీకు డబ్బును తెచ్చిపెట్టే పనేది? ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఒకే చోట కలిసినప్పుడే మనకు 'ఇకిగాయ్' దొరుకుతుంది.

Japanese

జపాన్ దేశానికి చెందిన ఇకిగాయ్ అనే ఒక అద్భుతమైన సైకలాజికల్ కాన్సెప్ట్ గురించి.. ప్రతీ ఒక్కరూ తెలుసుకోవడం చాలా అవసరం. ఇకిగాయ్ అంటే జపనీస్ (Japanese) భాషలో ‘జీవించడానికి గల కారణం’ అని అర్థం. చాలా మందికి జీవితంలో అంతా ఉన్నా కూడా వారిలో ఏదో తెలియని వెలితి ఉంటుంది.

ఉదయాన్నే నిద్ర లేవడానికి ఒక బలమైన కారణం లేదంటూ మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ ఇకిగాయ్ అనేది మనిషి తనలోని అసలైన సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఎలా కనుగొనాలో నేర్పిస్తుంటుంది.

ఇది ప్రధానంగా నాలుగు అంశాల కలయికతో ఉంటుంది. మీకు ఇష్టమైన పనేంటి? మీరు ఏ పనిలో నిపుణులు? ప్రపంచానికి మీ నుంచి ఏం అవసరం? మీకు డబ్బును తెచ్చిపెట్టే పనేది? ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఒకే చోట కలిసినప్పుడే మనకు ‘ఇకిగాయ్’ దొరుకుతుంది.

ఇది కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం అని తెలుసుకోవాలి. దీనిని అనుసరించడం వల్ల మనిషిలో డిప్రెషన్ తగ్గుతుంది , జీవితంపై స్పష్టత వస్తుంది.

సైకలాజికల్ గా చూస్తే మనలో చాలా మంది వేరొకరి కోసమో లేక కేవలం డబ్బు కోసమో ఇష్టం లేని పనులు చేస్తూ సతమతమవుతుంటారు. దీనివల్ల మెదడులో ఎప్పుడూ ఒక టెన్షన్ ఉంటుంది. ఇకిగాయ్ దొరికిన వ్యక్తికి తన పని పట్ల విసుగే ఉండదు. ఎందుకంటే ఆ పనిలో అతనికి సంతృప్తి, సంతోషం రెండూ దొరుకుతాయి.

Japanese
Japanese

జపాన్(Japanese) లోని ఓకినావా దీవిలో ప్రజలు.. వందేళ్లకు పైగా ఆరోగ్యంగా జీవించడానికి ఈ ఇకిగాయ్ రహస్యమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రిటైర్మెంట్ అనే పదం వారి నిఘంటువులోనే ఉండదట. అంటే చనిపోయే వరకు ఏదో ఒక ఇష్టమైన పనిలో నిమగ్నమై ఉండటం వల్ల వారి మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు.

మనందరం కూడా మనలో దాగి ఉన్న ఆ ఇకిగాయ్ ను కనుగొంటే, ప్రతి రోజూ ఒక పండుగలా అనిపిస్తుంది. ఒత్తిడితో కూడిన ఈ సొసైటీలో మనశ్శాంతిని పొందడానికి, జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ జపనీస్(Japanese) సూత్రం మనందరకీ దిక్సూచిలా పనిచేస్తుంది.

Tata Harrier EV :టాటా హారియర్ EV- అదిరిపోయే ఫీచర్లు.. ఈ కారును కొనడం తెలివైన నిర్ణయమేనా?

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button