Late Night
రాత్రి ఆలస్యంగా(Late Night) తినడం ఇప్పుడు చాలా మందికి అలవాటైపోయింది. పని ఆలస్యం అవుతుందో, ఫోన్ చూస్తూ టైమ్ పోతుందో, లేదా “ఇప్పుడేముంది లే” అని అనిపిస్తుందో… కానీ రాత్రి 10 తర్వాత తినడం మన శరీరంలో నిశ్శబ్దంగా పెద్ద నష్టం చేస్తుందన్న విషయం చాలామందికి తెలియదు.
మన బాడీకి కూడా ఒక టైమ్ టేబుల్ ఉంటుంది. పగలు పని చేయడానికి, రాత్రి రిపేర్ (Repair) చేసుకోవడానికి. కానీ మనం రాత్రి ఆలస్యంగా తినేస్తే ఆ టైమ్ టేబుల్ మొత్తం తలకిందులవుతుంది. రాత్రి పడుకునే ముందు తిన్న ఆహారం జీర్ణం కావడానికి శరీరానికి ఎక్కువ శ్రమ పడుతుంది. కానీ అదే టైమ్‌లో బాడీ రెస్ట్ మోడ్‌లోకి వెళ్లాలి. ఈ రెండు ఒకేసారి జరిగితే గందరగోళం మొదలవుతుంది.
ఫలితం ఏమిటంటే… నిద్ర సరిగా పడదు. “పడుకున్నా నిద్ర రావడం లేదు”, “మధ్యలో లేచిపోతున్నా”, “ఉదయం అలసటగా ఉంది” – ఇవన్నీ ఆలస్యంగా తినే అలవాటుకు సంబంధించిన సిగ్నల్సే. ఇంకో పెద్ద సమస్య ఏమిటంటే… రాత్రి ఆలస్యంగా తినడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగదు. దాంతో గ్యాస్, ఆమ్లత్వం (Acidity), ఛాతీలో మంట (Heartburn) లాంటి సమస్యలు మొదలవుతాయి. ఇదే నెమ్మదిగా పెద్ద జబ్బులకు బేస్ అవుతుంది.
డాక్టర్లు చెప్పని కానీ నిజమైన విషయం ఏంటంటే.. రాత్రి ఆలస్యంగా (Late Night)తినే వాళ్లలో కొవ్వు ఎక్కువగా పొట్ట చుట్టూ (Belly Fat) చేరుతుంది. ఎందుకంటే రాత్రి తిన్న ఎనర్జీ ఖర్చు అయ్యే అవకాశం ఉండదు. అది నేరుగా స్టోర్ అవుతుంది. అదే బెల్లీ ఫ్యాట్. ఈ బెల్లీ ఫ్యాట్ కేవలం బయట కనిపించే సమస్య కాదు. ఇది హార్ట్, లివర్ మీద కూడా ప్రభావం చూపుతుంది.
ఫ్యాటీ లివర్ (Fatty Liver), షుగర్ (Diabetes), బీపీ (BP) లాంటి సమస్యలు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. రాత్రి ఆలస్యంగా తింటే మన హార్మోన్ల బ్యాలెన్స్ కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా ఇన్సులిన్. దాంతో ఆకలి సరిగా అర్థం కాకుండా పోతుంది. దీని ప్రభావం మానసికంగా కూడా పడుతుంది.
ఉదయం లేవగానే చిరాకు, చిన్న విషయానికే కోపం, ఏ పనిపైనా ఆసక్తి లేకపోవడం. ఇవి అన్నీ సరైన నిద్ర లేకపోవడం వల్లే. దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కాదు. రాత్రి పడుకునే ముందు కనీసం 2–3 గంటల గ్యాప్ ఇవ్వడం చాలూ. రాత్రి(Late Night) భోజనం తేలికగా ఉండాలి. బరువైన, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫుడ్ రాత్రికి తగ్గదు. తిన్నాక వెంటనే పడుకోకుండా కాస్త నడవడం మంచిది. ఆహారం మన శక్తి. కానీ టైమ్ తప్పితే అదే మన బలహీనత అవుతుంది.
