Melasma: మంగు మచ్చలు వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

Melasma: ముఖంపై ఏర్పడే సాధారణ మచ్చలకే మనం బాధపడతాం. అలాంటిది గోధుమ రంగులో కనిపించే మంగు మచ్చలు వస్తే, ఆ బాధ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

Melasma

చర్మానికి సంబంధించిన సమస్యల్లో మంగు మచ్చలు ఒకటి. వయసుతో పాటు వచ్చే ఈ మచ్చలను తగ్గించడానికి రకరకాల క్రీములు వాడి ఆరోగ్యం పాడు చేసుకోకుండా, సహజసిద్ధమైన చిట్కాలతో వీటిని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖంపై ఏర్పడే సాధారణ మచ్చలకే మనం బాధపడతాం. అలాంటిది గోధుమ రంగులో కనిపించే మంగు మచ్చలు వస్తే, ఆ బాధ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మచ్చల వల్ల అందంగా ఉన్నవారు కూడా ఆకర్షణ కోల్పోతారు. దీనికి పరిష్కారం కోసం రకరకాల ప్రొడక్ట్స్‌ వాడి సమస్యను మరింత జఠిలం చేసుకుంటారు.

మంగు మచ్చలు(Melasma) అంటే ఏమిటి? ఎందుకు వస్తాయి?
వయసు పెరిగే కొద్దీ చర్మంపై నల్లని లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇవి సాధారణ మొటిమలు లేదా నల్ల మచ్చలలా ఉండవు. వీటినే మంగు మచ్చలు (Melasma) అంటారు. ఇవి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. శరీరంలో మెలనిన్ అనే వర్ణ ద్రవ్యం ఎక్కువగా ఉత్పత్తి అయితే మంగు మచ్చలకు దారితీస్తుంది. కొందరిలో హార్మోన్ల సమతుల్యత లోపం వల్ల వస్తే, మరికొందరిలో వంశపారంపర్యంగా వస్తుంది. అంతేకాకుండా, పోషకాహార లోపం, అధిక ఉష్ణోగ్రత, కాలుష్యం, కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా ఇవి ఏర్పడవచ్చు.

మంగు మచ్చలు(Melasma) రాకుండా ఎలా నివారించాలి?
నివారణ అనేది చికిత్స కంటే ముఖ్యం. మంగు మచ్చలు రాకుండా ఉండాలంటే ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లడం మానుకోవాలి. తప్పనిసరి అయితే, కనీసం SPF-30 ఉన్న సన్‌స్క్రీన్‌ను రోజూ రాసుకోవాలి. బయటికి వెళ్లినప్పుడు చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. చర్మానికి పడని కొన్ని రకాల మందులను వైద్యుల సలహా మేరకు మానేయడం మంచిది.

మంగు మచ్చల(Melasma)ను తొలగించే ఇంటి చిట్కాలు

Melasma

బంగాళాదుంప: బంగాళాదుంపను తురిమి, దాని రసాన్ని దూదితో ముఖంపై మచ్చలు ఉన్న చోట రాయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడగాలి. బంగాళాదుంపలో సహజంగా బ్లీచింగ్ గుణాలు ఉంటాయి.

టమోటా: టమోటా గుజ్జును మచ్చలపై రాసుకుని 20 నిమిషాలు ఉంచి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. టమోటా కూడా బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

నిమ్మరసం మిశ్రమం: నిమ్మరసం, కీరదోస, తేనె, రోజ్ వాటర్ కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలపై రాసుకుని 15-20 నిమిషాల తర్వాత కడగాలి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి చర్మానికి మేలు చేస్తుంది.
జాజికాయ.. జాజికాయను పాలతో కలిపి ఒకరాయిపై అరగదీసి ఈ పేస్టు ఆ మచ్చల మీద పెడితే మంగు మచ్చలు క్రమేపీ తగ్గిపోతాయి.

ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే, మంగు మచ్చలు క్రమంగా తగ్గుతాయి. అయితే, సమస్య తీవ్రంగా ఉంటే చర్మ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Thousand Pillar Temple: వేయి స్తంభాల గుడి.. కాకతీయుల కళా వైభవం,చరిత్రకు సాక్ష్యం

Exit mobile version