Mouthwash:మౌత్ వాష్ అతిగా వాడుతున్నారా? అది ఎంత డేంజరో తెలుసుకోండి ముందు..

Mouthwash: మౌత్ వాష్ వాడటం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉందని తాజా పరిశోధనల్లో వెల్లడయింది.

Mouthwash

ప్రస్తుతం చాలామందిలో నోటి పరిశుభ్రత (Oral Hygiene) పట్ల అవగాహన బాగానే పెరిగింది. బ్రష్ చేయడంతో పాటు చాలా మంది మౌత్ వాష్(Mouthwash) వాడటాన్ని అలవాటుగా మార్చుకున్నారు. నోటి దుర్వాసనను పోగొట్టి, ఫ్రెష్‌గా ఉంచుతుందని చాలామంది అయితే చాలా ఎక్కువగా దీనిని వాడుతున్నారు.

అయితే నిజానికి ఈ మౌత్ వాష్‌లు మన బాడీలోని లోతైన వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అతిగా మౌత్ వాష్ వాడటం వల్ల రక్తపోటు (High BP) పెరిగే ప్రమాదం ఉందని తాజా పరిశోధనల్లో వెల్లడైందని అంటున్నారు. ఇది వినడానికి వింతగా ఉన్నా, దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉందని చెబుతున్నారు.

మన నోటిలో హానికరమైన బ్యాక్టీరియాలు మాత్రమే కాకుండా, శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుందన్న విషయం చాలామందికి తెలీదు. ఈ మంచి బ్యాక్టీరియానే మనం తినే ఆహారం నుంచి నైట్రేట్లను గ్రహించి, వాటిని నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ మన బాడీలోని రక్తనాళాలు వ్యాకోచించడానికి (Relax అవ్వడానికి) సహాయపడుతుంది.

Mouthwash

ఎప్పుడైతే రక్తనాళాలు ప్రశాంతంగా ఉంటాయో, అప్పుడు బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. అయితే, మనం రెగ్యులర్‌గా వాడే మౌత్ వాష్‌(Mouthwash)లలో ‘క్లోరెక్సిడైన్’ వంటి శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ కెమికల్స్ ఉంటాయి. ఇవి చెడు బ్యాక్టీరియాతో పాటు, మేలు చేసే మంచి బ్యాక్టీరియాను కూడా తుడిచిపెట్టేస్తాయట. దీంతో శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి తగ్గిపోయి, రక్తనాళాలు బిగుసుకుపోయి రక్తపోటు పెరుగుతుంది.

అంతేకాకుండా, మౌత్ వాష్‌లలో ఉండే ఆల్కహాల్ శాతం నోటిని పొడిబారేలా (Dry Mouth) చేస్తుందట. లాలాజలం (Saliva) తక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల నోటిలో నేచురల్‌గా ఉండే రక్షణ వ్యవస్థ కూడా దెబ్బతింటుందట. దీనివల్ల చిగుళ్ల వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రోజుకు రెండు సార్లు కంటే ఎక్కువ మౌత్ వాష్ వాడే వారిలో డయాబెటిస్ (Diabetes) వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

మరి దీనికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ మౌత్ వాష్‌ల కంటే సహజమైన పద్ధతులు ఎంతో మేలు అంటున్నారు నిపుణులు. గోరువెచ్చని నీటిలో కొంచెం సముద్రపు ఉప్పు (Rock Salt) వేసి పుక్కిలించడం వల్ల నోటిలోని ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతినదు. అలాగే భోజనం తర్వాత సోంపు గింజలు లేదా లవంగం బుగ్గన పెట్టుకోవడం వల్ల నోరు తాజాగా ఉంటుంది.

Silver Play Button:10 వేల వ్యూస్ వస్తే ఎన్ని వేలు వస్తాయి? సిల్వర్ ప్లే బటన్ దక్కాలంటే సబ్‌స్క్రైబర్లు ఉంటే సరిపోదా?

Exit mobile version