Silver Play Button:10 వేల వ్యూస్ వస్తే ఎన్ని వేలు వస్తాయి? సిల్వర్ ప్లే బటన్ దక్కాలంటే సబ్‌స్క్రైబర్లు ఉంటే సరిపోదా?
Silver Play Button: ఒకప్పుడు 1,00,000 మంది సబ్‌స్క్రైబర్లు రాగానే యూట్యూబ్ సిల్వర్ బటన్ పంపేది.
Silver Play Button
ఈ డిజిటల్ యుగంలో ‘యూట్యూబ్’ అనేది కేవలం టైం పాస్‌కి మాత్రమే కాదు, ఒక పూర్తిస్థాయి కెరీర్‌గా మారిపోయింది. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కెమెరా పట్టుకుని క్రియేటర్లుగా మారిపోతున్నారు. అయితే ఈ ప్రయాణంలో ప్రతీ యూట్యూబర్ సిల్వర్ ప్లే బటన్ (Silver Play Button) కోసం కల కంటారు.
అయితే లక్ష మంది సబ్‌స్క్రైబర్లు రాగానే ఈ బటన్ ( Silver Play Button ) మన చేతికి వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ, ఇప్పుడు యూట్యూబ్ తన నిబంధనలను చాలా స్ట్రిక్ట్ చేసింది. సబ్‌స్క్రైబర్లు లక్ష దాటినా కూడా, ఛానెల్‌లో ఏ చిన్న తప్పు ఉన్నా ఆ మెరిసే సిల్వర్ బటన్ మీ ఇంటికి రాదు.

ఒకప్పుడు 1,00,000 మంది సబ్‌స్క్రైబర్లు రాగానే యూట్యూబ్ సిల్వర్ బటన్(Silver Play Button) పంపేది. కానీ ఇప్పుడు యూట్యూబ్ ‘Creator Awards’ ప్రోగ్రామ్ కింద ప్రతి ఛానెల్‌ను డీటెయిల్డ్‌గా పరిశీలిస్తోంది. మీ ఛానెల్ లక్ష సబ్‌స్క్రైబర్లను చేరుకున్నాక మీరు అప్లై చేస్తే.. యూట్యూబ్ టీమ్ మీ ఛానెల్ గత 365 రోజుల హిస్టరీని చెక్ చేస్తుంది.
కాపీరైట్ స్ట్రైక్స్ (Copyright Strikes).. మీ ఛానెల్‌పై యాక్టివ్ స్ట్రైక్స్ ఏవీ ఉండకూడదు. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ప్రకారం హానికరమైన కంటెంట్ లేదా హింసను ప్రోత్సహించే వీడియోలు ఉండకూడదు. మీరు ఇతర ఛానెల్స్ వీడియోలను కట్ చేసి పెట్టి సబ్‌స్క్రైబర్లను సంపాదించి ఉంటే, మీకు అవార్డు రాదు. కంటెంట్ మీ సొంతం కావాలి. సబ్‌స్క్రైబర్లను(స్పామ్ అకౌంట్స్ ) కొనుగోలు చేసినట్లు తేలితే ఆ ఛానెల్‌ను శాశ్వతంగా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది.
యూట్యూబ్‌లో ఇన్కమ్ అనేది కేవలం వ్యూస్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. దీనిని ‘RPM’ (Revenue Per Mille) అంటారు. అంటే ప్రతి వెయ్యి వీక్షణలకు ఎంత డబ్బు వస్తుంది అని చూడటం . భారతదేశంలో ఒక ఇన్ఫర్మేటివ్ లేదా టెక్నాలజీ వీడియోకి 10,000 వ్యూస్ వస్తే సుమారు రూ. 200 నుంచి రూ. 500 వరకు వస్తుంది.
అదే కనుక మీరు ఫైనాన్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ గురించి వీడియోలు చేస్తే ఆ ఆదాయం రూ. 800 వరకు పెరగొచ్చు. ఎందుకంటే ఆ వీడియోలపై వచ్చే అడ్వర్టైజ్‌మెంట్స్ ఖరీదైనవిగా ఉంటాయి. అదే మీ వీడియోలను అమెరికా లేదా లండన్ వంటి దేశాల్లో చూస్తే, 10 వేల వ్యూస్‌కే మీకు వేలల్లో ఇన్కమ్ లభిస్తుంది.
యూట్యూబ్ ఇప్పుడు ‘Reuse Content’ ,’AI Generated Content విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. వేరే వాళ్ల వీడియోలను వాడుకుని వాయిస్ ఓవర్ ఇచ్చే ఛానెల్స్ మానిటైజేషన్ ఆగిపోతోంది. దీనిని ఓవర్ కమ్ చేయాలంటే..
వీలైనంత వరకు మీ ఫేస్ కనిపించేలా వీడియోలు చేయండి, దీనివల్ల ఛానెల్ అథెంటిసిటీ పెరుగుతుంది.అలాగే అన్ని రకాల వీడియోలు కాకుండా ఒకే అంశంపై (ఉదాహరణకు కిచెన్, వాస్తు లేదా టెక్) వీడియోలు చేస్తే సబ్‌స్క్రైబర్లు స్థిరంగా ఉంటారు.
కేవలం షార్ట్స్ మీద ఆధారపడకండి. షార్ట్స్ వల్ల సబ్‌స్క్రైబర్లు వస్తారు.. రీచ్ కూడా పెరుగుతుంది కానీ, లాంగ్ వీడియోల వల్లనే ఆదాయం , వాచ్ టైమ్ పెరుగుతాయి.
మొత్తానికి యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే ఓపిక, క్రియేటివిటీ చాలా ముఖ్యం. నిబంధనలను పాటిస్తూ సాగితే సిల్వర్ బటన్ మాత్రమే కాదు, గోల్డ్ ,డైమండ్ బటన్లు కూడా మీ సొంతమవుతాయి.
Maduro:మదురో నుంచి సద్దాం వరకూ అదే చరిత్ర పునరావృతం..మదురో అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?




2 Comments