Bipolar disorder
ఒక్కోసారి మనసు అంతులేని ఆనందంలో తేలిపోతూ ఉంటుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కటీ సాధ్యమే అనిపిస్తుంది. అదే మనసు మరోసారి అగాథమైన నిరాశలో కూరుకుపోతుంది. అన్ని శక్తులు కోల్పోయి, జీవితం శూన్యంగా కనిపిస్తుంది.
ఈ రెండు విరుద్ధమైన భావాల మధ్య జీవితం (Bipolar disorder) ఊగిసలాడుతుంటే అది తాత్కాలిక మూడ్ మార్పు కాదు.. అది ఒక తీవ్రమైన పోరాటం. ఆ పోరాటానికే పేరు బైపోలార్ డిసార్డర్.మీరు కూడా ఇలా రెండు అంచుల మధ్య కుదిపేసేలో సిచ్యువేషన్‌లోనే ఉన్నారా.. అయితే ఇది కచ్చితంగా మీకోసమే.
ఒక్కోసారి ఫుల్ ఎనర్జీ ,ఫుడ్, నిద్ర లేకపోయినా అలసట తెలియని స్థితిలో ఉంటారు. దీనిని ‘మానియా’ లేదా ‘మానిక్ ఎపిసోడ్'(Manic depressive disorder) అంటారు. మరో దశలో పూర్తిగా నిరాశ, నిస్సత్తువ, తాము పనికిరాని వారమనే భావనతో కుంగిపోతారు. దీనిని ‘డిప్రెసివ్ ఎపిసోడ్’ అని పిలుస్తారు. ఈ రెండు దశల మధ్య రోగి జీవితం ఒక పోరాటంలా సాగుతుంది.
Also Read: Anemia:సైలెంట్‌గా అటాక్ చేసే రక్తహీనత.. చెక్ పెట్టే సీక్రెట్ ఫుడ్స్ ఇవే
ఈ వ్యాధి రావడానికి గల కచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, మెదడులోని రసాయనాలైన డోపమైన్, సెరోటోనిన్‌లలో అసమతుల్యత ప్రధాన కారణంగా భావిస్తున్నారు. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే, అది వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, జీవితంలో ఎదురైన పెద్ద ఒత్తిళ్లు, అనుకోని సంఘటనలు, మాదకద్రవ్యాల వాడకం కూడా ఈ వ్యాధిని ప్రేరేపించవచ్చు.
బైపోలార్ డిసార్డర్(Bipolar disorder)ను గుర్తించడం చాలా ముఖ్యం. సాధారణ మూడ్ మార్పులు ఒక రోజులోనే మారిపోతాయి, కానీ బైపోలార్ లక్షణాలు వారాలపాటు కొనసాగుతాయి. రోగి తన రోజువారీ పనులను చేయలేక ఇబ్బంది పడతారు. మానిక్ దశలో అనవసర ఖర్చులు చేయడం, ఆలోచించకుండా రిస్కుతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేస్తారు. డిప్రెసివ్ దశలో మంచం దిగడానికి కూడా శక్తి లేనట్లుగా భావిస్తారు. ఈ స్థితిలో స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరం కావడమే కాకుండా, కొన్నిసార్లు ఆత్మహత్య ఆలోచనలు కూడా రావచ్చు.
బైపోలార్ డిసార్డర్(Bipolar disorder) అనేది సరైన చికిత్సతో నియంత్రించగలిగే వ్యాధి. ముందుగా దీన్ని గుర్తించి, నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. చికిత్సలో భాగంగా వైద్యులు మూడ్ స్టెబిలైజర్స్ (లిథియం వంటివి), అంటీసైకోటిక్స్ మందులను సూచిస్తారు. కొన్ని సందర్భాలలో అంటీడిప్రెసెంట్స్ కూడా ఇవ్వవచ్చు.
బైపోలార్ డిసార్డర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 మందిలో 1-2 మందికి ఉండే ఒక సాధారణ సమస్య. మందులతో పాటు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) వంటి మానసిక కౌన్సెలింగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది.
మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ వ్యాధిని కుటుంబ సభ్యులు, స్నేహితులు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. “ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు?” అని ప్రశ్నించడం కంటే, రోగికి సహనం, అండగా ఉండటం ఎంతగానో తోడ్పడుతుంది. సరైన నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం వంటి జీవనశైలి మార్పులు కూడా రోగిని స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి.