Black raisins
బ్లాక్ కిస్మిస్ (Black raisins)కేవలం రుచికే కాదు… ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సాధారణ కిస్మిస్‌తో పోలిస్తే, నల్ల కిస్మిస్‌లో పోషకాలు, ఔషధ గుణాలు చాలా ఎక్కువ. ఇందులో ఉండే విటమిన్లు ,మినరల్స్ మన శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.
బ్లాక్ కిస్మిస్(Black raisins)లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేసి, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కంటిలోని కండరాలపై ఒత్తిడిని తగ్గించి, కంటి చూపును మెరుగుపరచడంలో యాంటీ ఆక్సిడెంట్లు సహాయపడతాయి. ముఖ్యంగా, అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ నల్ల కిస్మిస్ తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలకు ఇది ఒక సహజమైన పరిష్కారం.
బ్లాక్ కిస్మిస్(Black raisins) గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇందులో ఉండే పొటాషియం రక్త నాళాలను రిలాక్స్ చేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల హైబీపీ తగ్గి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిని పెంచడంలో ఇది సహాయపడుతుంది. ఇది గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పొటాషియం ,కాల్షియం అధికంగా ఉండటం వల్ల బ్లాక్ కిస్మిస్ ఎముకల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఆస్టియోపోరోసిస్ ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా, బ్లాక్ కిస్మిస్‌లో ఉండే విటమిన్లు, మినరల్స్ ,ఐరన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి, రక్తహీనతను నివారిస్తాయి. అధిక బరువును తగ్గించుకోవాలనుకునే వారికి కూడా బ్లాక్ కిస్మిస్ ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో బరువు తగ్గడానికి ఇది దోహదపడుతుంది.