Vijay Hazare: ఇంకా ఉన్నాయా డౌట్స్.. విజయ్ హజారేలో రోకో అదుర్స్

Vijay Hazare: లిస్ట్ ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 16 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మైలురాయిని కోహ్లి 343 మ్యాచ్ లలో అందుకున్నాడు. గతంలో సచిన్ మాత్రమే భారత్ తరపున ఈ ఘనత సాధించాడు.

Vijay Hazare

ఇంకేం ఆడతారు.. వన్డేలకు కూడా రిటైర్మెంట్ ఇచ్చేయొచ్చు… ఫిట్ నెస్ కాపాడుకోవడం కష్టం… ఫామ్ కంటిన్యూ చేయడం మరీ కష్టం.. కుర్రాళ్లతో పోటీలో నిలవడం కష్టమే.. ఇవీ రెండు మూడు నెలలుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి వినిపించిన మాటలు.. నిజమే రోకో జోడీ కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు.. కొన్నేళ్లుగా వీరు సాధించని రికార్డులు లేవు.. అందుకోని మైలురాళ్లు లేవు… రుచి చూడని విజయాలు లేవు.. గంభీర్ తో ఉన్న సమస్యతో టెస్ట్ క్రికెట్ కు, అంతకుముందు టీ20లకు గుడ్ బై చెప్పేసిన వీరిద్దరూ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు.

2027 వరల్డ్ కప్ వరకూ కొనసాగాలనే పట్టుదలతో ఉన్న రోహిత్ , కోహ్లీ ఇటీవల ఆసీస్ టూర్ లోనూ, తర్వాత సౌతాఫ్రికాతో సిరీస్ లోనూ తమ సత్తా ఏంటనేది అందరికీ చాటి చెప్పారు. ఇప్పుడు దేశవాళీ టోర్నీ విజయ్ హజారే(Vijay Hazare)లోనూ దుమ్మురేపుతున్నారు. తమ తమ స్టేట్ టీమ్స్ తరపున బరిలోకి దిగిన రోకో తొలిరోజు శతకాల మోత మోగించారు.

Vijay Hazare

తమ సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తూ అదరగొట్టారు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు ముందు దంచికొట్టారు. ముంబై తరపున దాదాపు 7 ఏళ్ల తర్వాత విజయ్ హజారే (Vijay Hazare)ట్రోఫీ ఆడుతున్న రోహిత్ శర్మ సిక్కింతో మ్యాచ్ లో కేవలం 61 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దీనిలో 80 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. రోహిత్ కు ఇది 37వ లిస్ట్ ఏ క్రికెట్ సెంచరీ.

రోహిత్ 155 పరుగులతో చెలరేగడంతో ముంబై 8 వికెట్ల తేడాతో సిక్కింను ఓడించింది. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం శతక్కొట్టాడు. 15 ఏళ్ల నుధీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీ ఆదుకున్న కోహ్లి ఆంధ్రాతో మ్యాచ్ లో 101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 రన్స్ చేశాడు. గత ఐదు వన్డేల్లో కోహ్లికి ఇది మూడో సెంచరీ. కాగా ఈ ఇన్నింగ్స్ తో సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.

లిస్ట్ ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 16 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మైలురాయిని కోహ్లి 343 మ్యాచ్ లలో అందుకున్నాడు. గతంలో సచిన్ మాత్రమే భారత్ తరపున ఈ ఘనత సాధించాడు. సచిన్ 551 మ్యాచ్ లలో 21,999 పరుగులు చేసి లిస్ట్ ఏ క్రికెట్ అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version