Toothache: పంటి నొప్పి వేధిస్తే ఇలా చేయండి.. సింపుల్ చిట్కాలు మీకోసం

Toothache: సాధారణంగా దంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, ఇన్ఫెక్షన్ల వల్ల పంటి నొప్పి వస్తుంది. ఇలాంటి సమయంలో నీటిలో కాస్త ఉప్పు కలిపి పుక్కిలించడం వల్ల నొప్పి, ఇన్ఫెక్షన్ తగ్గి ఉపశమనం లభిస్తుంది.

Toothache

మనలో చాలామందికి పంటి నొప్పి(Toothache) ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. ఈ నొప్పి వచ్చినప్పుడు ఏమీ తినలేము, కనీసం మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడతాం. అలాంటి సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్లలేని పరిస్థితి ఉంటే, కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా ఈ నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందొచ్చు.

సాధారణంగా దంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, ఇన్ఫెక్షన్ల వల్ల పంటి నొప్పి వస్తుంది. ఇలాంటి సమయంలో నీటిలో కాస్త ఉప్పు కలిపి పుక్కిలించడం వల్ల నొప్పి, ఇన్ఫెక్షన్ తగ్గి ఉపశమనం లభిస్తుంది. అలాగే, అప్పుడే కోసిన ఉల్లిగడ్డ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై పెట్టడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఉల్లిగడ్డలో ఉండే గుణాలు నొప్పి నుంచి వెంటనే రిలీఫ్ ఇస్తాయి.

Toothache

పంటి నొప్పి(Toothache)ని తగ్గించేందుకు జామ ఆకులు కూడా బాగా పని చేస్తాయి. జామ ఆకుల్లో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-మైక్రోబియల్ గుణాలు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వెల్లుల్లి కూడా పంటి నొప్పి తగ్గించడంలో మంచి పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటీబయోటిక్ గుణాలు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వెల్లుల్లిని బాగా దంచి అందులో ఉప్పు లేదా మిరియాల పొడి కలిపి నొప్పి ఉన్న పంటిపై ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.

చిగుళ్ల నొప్పికి కూడా పరిష్కారం ఉంది. ఆవ నూనెలో చిటికెడు ఉప్పు కలిపి చిగుళ్లపై మసాజ్ చేస్తే వెంటనే నొప్పి తగ్గుతుంది. అలాగే, లవంగాన్ని కూడా నొప్పి ఉన్న పంటి మీద పెట్టి నెమ్మదిగా నొక్కితే ఉపశమనం లభిస్తుంది. అయితే, పంటి నొప్పి ఉన్న సమయంలో తీపి పదార్థాలు, కూల్‌డ్రింక్స్ అస్సలు తీసుకోవద్దు. ఇవి సమస్యను మరింత పెంచుతాయి. గుర్తుంచుకోండి, ఇవన్నీ తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే. పంటి నొప్పి మళ్లీ వస్తే మాత్రం డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version