Overthinking: అతిగా ఆలోచించడం ఎంత డేంజరో తెలుసా..? మీ శరీరాన్ని బలహీనపరుస్తున్న మానసిక శత్రువు అదే

Overthinking: రోజూ అదే పనిగా ఆలోచిస్తుంటే ఆ హార్మోన్లు మన కండరాలను, గుండెను, జీర్ణక్రియను దెబ్బతీస్తాయి.

Overthinking

చాలామంది “నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్ లేదు కానీ శరీరం ఎప్పుడూ అలసిపోయినట్లుగా ఉంటుంది” అని అంటుంటారు. దీనికి కారణం శరీరంలో కాదు, మన మైండ్ లో ఉంటుంది. అతిగా ఆలోచించడం (Overthinking)అనేది ఒక పెద్ద వ్యాధి లాంటిది.

మన మెదడు ఎప్పుడూ టెన్షన్ లో ఉంటే శరీరం కూడా ఎప్పుడూ ఒక రకమైన యుద్ధ స్థితిలో ఉంటుంది. దీన్నే ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ మోడ్ అంటారు.

మనసులో టెన్షన్ ఉన్నప్పుడు శరీరం స్ట్రెస్ హార్మోన్లను విపరీతంగా విడుదల చేస్తుంది. ఇది ఒక్క రోజుతో ఆగిపోతే పర్వాలేదు కానీ, రోజూ అదే పనిగా ఆలోచిస్తుంటే ఆ హార్మోన్లు మన కండరాలను, గుండెను, జీర్ణక్రియను దెబ్బతీస్తాయి.

అందుకే అతిగా ఆలోచించే వాళ్లకు మెడ నొప్పి, భుజాల నొప్పి తరచూ వస్తుంటాయి. కండరాలు బిగుసుకుపోవడమే దీనికి ప్రధాన కారణం.

మరో ముఖ్యమైన విషయం నిద్ర. అతిగా ఆలోచించే (Overthinking)వాళ్లకు రాత్రి పడుకున్నా మైండ్ లో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. దీనివల్ల సరైన నిద్ర ఉండదు. నిద్ర లేకపోతే శరీరం తనను తాను రిపేర్ చేసుకోలేదు. దీనివల్ల ఉదయం లేవగానే నీరసం, తలనొప్పి, కళ్ల మంటలు వస్తాయి. జీర్ణక్రియ కూడా ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది.

Overthinking

మనసు ప్రశాంతంగా లేకపోతే మనం ఏం తిన్నా అది ఒంటికి పట్టదు. గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు కేవలం ఆహారం వల్ల కాదు, అతిగా ఆలోచించడం వల్ల కూడా వస్తాయి. మన రోగనిరోధక శక్తి కూడా మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. అతిగా ఆలోచించే వాళ్ళకు చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా అది త్వరగా తగ్గదు.

అతిగా ఆలోచనలు (Overthinking)వస్తే మైండ్‌ను డైవర్ట్ చేసే పనులు చేయాలి. ఫ్రెండ్స్‌తో మాట్లాడటం, నచ్చిన పుస్తకాన్ని చదవడం, బయట కాసేపు అలా తిరిగిరావడం, లేదా నచ్చిన హాబీని మెరుగుపరుచుకోవడం వంటి పనులు చేయాలి.

బాడీని బాగు చేయాలంటే ముందు మైండ్ ను స్లో చేయడం నేర్చుకోవాలి. రేపటి గురించి భయపడటం మానేసి, ఈ రోజు ఉన్నదాన్ని ఆస్వాదించాలి. ప్రతి రోజూ కొంచెం సేపు నిశ్శబ్దంగా కూర్చోవడం, లోతైన శ్వాస తీసుకోవడం వంటివి మీ శరీరాన్ని మళ్లీ శక్తివంతంగా మారుస్తాయి.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version