Barley :బార్లీ నీరు ఇలా తాగితే రెట్టింపు లాభాలట..

Barley : బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ బార్లీ (Barley) అనే అద్భుతమైన ధాన్యాన్ని మరచిపోవద్దని నిపుణులు చెబుతున్నారు

Barley

ఇప్పుడు వేళాపాళా లేని అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, గంటల తరబడి ఆఫీస్ కుర్చీలో కూర్చోవడం వంటి శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది అధిక బరువు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఫిట్‌గా, ఆరోగ్యకరంగా ఉండాలంటే సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ బార్లీ (Barley) అనే అద్భుతమైన ధాన్యాన్ని మరచిపోవద్దని నిపుణులు చెబుతున్నారు

పూర్వ కాలంలో బార్లీని ఎన్నో సమస్యల నుంచి బయటపడేందుకు ఎక్కువగా తినేవారు. ఆయుర్వేదంలో దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు. పోషకాహార నిపుణుల ప్రకారం, సహజ ఆహారం ద్వారా బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ ఒక వరం లాంటిది. ఇది అవసరమైన సూక్ష్మపోషకాలతో కూడిన అధిక ఫైబర్ కలిగిన తృణధాన్యం. బార్లీ(Barley) నీరు తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

బరువు తగ్గడం.. బార్లీలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు ఆరోగ్యకరమైనది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. బార్లీ నీటిని తాగడం వల్ల తరచుగా ఆకలి వేసే సమస్య ఉండదు, దీంతో మీరు తక్కువ మొత్తంలో కేలరీలను తీసుకుంటారు. ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

barley

గుండె ఆరోగ్యం.. ఈ నీరు మీ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను (HDL) పెంచుతుంది. దీని వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు సమతుల్యంగా ఉండి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

మధుమేహ నియంత్రణ.. ఒక అధ్యయనం ప్రకారం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి , డయాబెటీస్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి బార్లీ నీరు అద్భుతంగా సహాయపడుతుంది.

శరీర శుద్ధి (Detox) & UTI నివారణ.. బార్లీ నీరు మన శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది, అలాగే ఎక్కువ మూత్ర విసర్జనకు సహాయపడుతుంది. దీనివల్ల మూత్రపిండాలు పూర్తిగా శుభ్రంగా ఉంటాయి. ఇది కిడ్నీ స్టోన్స్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది, అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) సమస్యలు వచ్చే అవకాశం ఉండదు.

రోగ నిరోధక శక్తి.. బార్లీలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సిద్ధం చేసి, రోగనిరోధక శక్తిని (Immunity) కూడా బలోపేతం చేస్తాయి.

బార్లీ(Barley) నీటిని ఎలా తయారు చేయాలి, రెట్టింపు లాభాల కోసం ఏం చేయాలనే దానిపై నిపుణులు సూచనలు ఇస్తున్నారు. బార్లీ నీటిని తయారు చేయడానికి ముందుగా దాన్ని శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసుకుని బాగా మరిగించాలి. బార్లీ నీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మకాయ రసాన్ని లేదా నిమ్మ తొక్కను కలపడం వల్ల అది మరింత ప్రభావవంతంగా మారుతుంది. తక్కువ మంట మీద 15 నిమిషాలు మరిగించిన తరువాత, బార్లీ ఉడికిన ఆ నీటిని వడకట్టి, రుచి కోసం కొద్దిగా తేనె కలిపి ప్రతి రోజూ ఉదయం తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version