Soaked nuts
ఉదయం లేవగానే టీ, కాఫీ తాగుతాం.. కానీ, మన ఆరోగ్యం గురించి మాత్రం అంతగా ఆలోచించం. మనం తీసుకునే చిన్నపాటి ఆహారం మన శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తుందో ఒక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యపోతాం. మీరు ఎప్పుడైనా ఉదయాన్నే నానబెట్టిన నట్స్(Soaked nuts)ను తిన్నారా? రుచి కాస్త భిన్నంగా ఉన్నా, వీటి లాభాలు మాత్రం అసాధారణం. వీటిని తినడం వల్ల కలిగే లాభాలు వింటే రేపటి నుంచి మీరూ ఈ అలవాటు చేసుకుంటారు.
ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో భాగంగా ఉదయాన్నే నానబెట్టిన నట్స్(Soaked nuts)ను తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. టేస్ట్ కాస్త భిన్నంగా ఉన్నా, వీటి లాభాలు మాత్రం చాలా ఎక్కువ.
- నానబెట్టిన గింజలను ఉదయాన్నే పరగడుపున తింటే అందులోని ఐరన్, కాల్షియం, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలన్నీ శరీరం సులభంగా గ్రహిస్తుంది.
- శక్తి, చురుకుదనం.. వీటిని తినడం వల్ల రోజంతా శక్తివంతంగా, చురుగ్గా ఉంటారు.
- కొలెస్ట్రాల్, జ్ఞాపకశక్తి.. నానబెట్టిన బాదం పలుకులు ఉదయాన్నే తింటే శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
- బరువు తగ్గుతారు.. బరువు తగ్గేందుకు ప్రయత్నించేవాళ్లు వాల్‌నట్స్, పిస్తా పలుకులను రాత్రిపూట నానబెట్టుకుని ఉదయం తింటే మంచి ఫలితం ఉంటుంది.
- షుగర్ లెవెల్స్ కంట్రోల్.. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు నానబెట్టిన నట్స్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
అయితే, పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిని ఎక్కువగా తినడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. వారానికి 10 బాదం పలుకులు, 5 వాల్‌నట్స్, ఒక గుప్పెడు పిస్తా పలుకులు, 5 జీడిపప్పులను తినవచ్చని చెబుతున్నారు.