YS Jagan : వైఎస్ జగన్ కీలక నిర్ణయం..పాదయాత్రపై సంచలన ప్రకటన

YS Jagan : మరోసారి పాదయాత్ర చేయడంతోనే సీఎం అవ్వాలనుకుంటున్న వైఎస్ జగన్ ప్రకటనతో వైసీపీలో జోష్ వచ్చినట్టేనని చెప్పొచ్చు.

YS Jagan

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్రలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నికలకు ముందు చాలా మంది నేతలు పాదయాత్రలతో అధికారాన్ని చేజిక్కించుకున్న సందర్భాలు అందరికీ తెలుసు. వైఎస్ఆర్ (YSR) బాటలోనే వైఎస్ జగన్ (YS Jagan) కూడా ఓదార్పు యాత్రతో మొదలుపెట్టి 2019లో భారీ మెజార్టీతో సీఎం అయ్యారు. 2024 ఎన్నికల్లో ఘోరపరాభవం తర్వాత కొద్ది రోజులు సైలెంట్ అయిన వైఎస్ జగన్ (YS Jagan) మెల్లిగా పార్టీ కార్యకర్తలతో వరుస భేటీలు అవుతున్నారు.

తాజాగా వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీని కోసం పాదయాత్ర చేయబోతున్నట్టు ప్రకటించారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెట్టనున్నట్టు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తే ఎన్నికల్లో విజయం ఖాయం అనే సెంటిమెంట్ బలంగా ఉంది. పాదయాత్ర కారణంగానే 2004, 2009లో కాంగ్రెస్ ఏపీలో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. అలాగే 2017లో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు.

ప్రజా సంకల్పయాత్ర పేరుతో 13 జిల్లాల మీదుగా 3648 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర సాగించారు. ప్రజలతో మమేకమవుతూ జగన్ సుదీర్ఘ పాదయాత్ర సాగింది. తర్వాత 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లలో విజయం సాధించి అధికారాన్ని అందుకుంది. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయి కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో జగన్ మరోసారి పాదయాత్రనే నమ్ముకున్నారు.

YS Jagan

ఎన్నికల్లో గెలుపు కోసం పాదయాత్ర చేయాల్సిందే అనే నమ్మకం తెలుగునాట బలంగా నాటుకుపోయింది. 2024 ఎన్నికల టైమ్ లోనూ లోకేష్ కుప్పం నుంచి ప్రారంభించి ఇచ్చాపురం వరకు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. యువ గళం పేరుతో జరిగిన ఈ పాదయాత్ర లో లోకేష్ 150 నియోజకవర్గాలు తిరిగారు.

తెలంగాణాలోనూ పాదయాత్ర సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత లు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఇద్దరూ తెలంగాణలో పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఆ పాదయాత్ర చేయడంతోనే సీఎం అవ్వాలనుకుంటున్న వైఎస్ జగన్ (YS Jagan) ప్రకటనతో వైసీపీలో జోష్ వచ్చినట్టేనని చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం పాలన ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని జగన్ చెబుతున్నారు. వైసీపీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని స్పష్టం చేశారు. ఇకపై కార్యకర్తలు, నియోజకవర్గ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు.

TTV Dhinakaran :టీటీవీ దినకరన్ రీ-ఎంట్రీతో ఎన్డీయేకు కొత్త ఊపు..తమిళనాడు రాజకీయాల్లో భారీ మలుపు

Exit mobile version