Foods
మనం నిత్యం తీసుకునే కొన్ని ఆహారాలు మన శరీరానికి తెలియకుండానే హాని కలిగించవచ్చు. కొన్నిసార్లు, మనం తినే ఆహారం (Foods)వల్ల గ్యాస్, ఉబ్బరం, అలసట, లేదా చర్మ సమస్యలు రావచ్చు. కానీ, చాలామందికి ఈ సమస్యలకు కారణం ఏమిటో తెలియదు. మన శరీరానికి సరిపడని ఆహారాలను గుర్తించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చు.
శరీరానికి పడని ఆహారాలు (Foods)తీసుకున్నప్పుడు కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. జీర్ణ సమస్యలు అంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, లేదా విరేచనాలు రావడం అలాగే శారీరక లక్షణాలు తలనొప్పి, కీళ్ల నొప్పులు, దీర్ఘకాలిక అలసట ఏర్పడతాయి. కొన్నిసార్లు చర్మంపై దద్దుర్లు, దురద, లేదా ఎగ్జిమా వంటి చర్మ సమస్యలు ఏర్పడతాయి .
ఈ లక్షణాలు కనిపించినప్పుడు, వాటికి కారణం ఆహారమే కావచ్చు. మీ శరీరానికి ఏ ఆహారం(Foods) సరిపడదో తెలుసుకోవడానికి ‘ఎలిమినేషన్ డైట్’ ఒక ప్రభావవంతమైన మార్గం. ఈ పద్ధతిలో, మీరు అనుమానించే ఆహార పదార్థాలను మీ రోజువారీ ఆహారం నుంచి ఒక వారం లేదా రెండు వారాల పాటు పూర్తిగా తొలగించాలి. ఆ తర్వాత, ఒకటొకటిగా ఆ ఆహారాలను మళ్ళీ మీ డైట్‌లో చేర్చాలి.
ఉదాహరణకు, మీరు పాలు తాగడం మానేసి, కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ తాగినప్పుడు మీకు జీర్ణ సమస్యలు వస్తే, మీ శరీరానికి డైరీ ఉత్పత్తులు సరిపడదని అర్థం చేసుకోవచ్చు.అలాగే కొన్ని రకాల ఆహారాలు చాలామందికి సరిపడవు.
గ్లూటెన్.. గోధుమ, బార్లీ, రై వంటి ధాన్యాలలో ఇది ఉంటుంది. గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి జీర్ణ సమస్యలు వస్తాయి.
డైరీ ఉత్పత్తులు.. పాలు, పెరుగు, చీజ్ వంటివి. లాక్టోస్ అలర్జీ ఉన్నవారికి ఇవి కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను కలిగిస్తాయి.
సోయా.. సోయాబీన్స్, సోయా సాస్, టోఫు వంటివి కొంతమందికి అలర్జీకి కారణం కావచ్చు.
నట్స్.. బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటివి కొంతమందిలో తీవ్రమైన అలర్జీకి దారితీస్తాయి.ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వాటిని తీసుకోవడం ఆపేయాలి. సమస్య కాస్త తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాలి.