Eating
ఆధునిక జీవనశైలి మన అలవాట్లను పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు నేలపై కూర్చుని భోజనం చేయడం మన సంస్కృతిలో ఒక భాగం. కానీ ఇప్పుడు డైనింగ్ టేబుల్స్, కుర్చీలు అని కొత్త పద్ధతులు వచ్చాయి. అయితే, కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, నేలపై కూర్చొని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మనం ఈ అనాది అలవాటులోని శాస్త్రీయ రహస్యాలను ఒకసారి తెలుసుకుందాం.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది..నేలపై కూర్చొని తినడం(Eating) వల్ల శరీరంలోని రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. కుర్చీలో కూర్చున్నప్పుడు రక్తం కాళ్లలో గడ్డకట్టే అవకాశం ఉంటుంది. కానీ నేలపై కూర్చోవడం వల్ల రక్తం గుండె నుంచి శరీరంలోని అన్ని భాగాలకు, ముఖ్యంగా జీర్ణాశయానికి సులభంగా చేరుకుంటుంది. దీంతో ఆహారంలోని పోషకాలు సమర్థవంతంగా శరీరానికి అందుతాయి.
ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి..నేలపై కూర్చొని భోజనం(eating) చేసే భంగిమ జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల జీర్ణ సమస్యలైన అసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటివి తగ్గుతాయి. అంతేకాకుండా, ఈ భంగిమలో కూర్చున్నప్పుడు మోకాళ్లకు, వెన్నుముకకు, కండరాలకు ఒక రకమైన వ్యాయామం జరుగుతుంది. దీంతో శరీరంలో వశ్యత (flexibility) పెరిగి, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఊబకాయం దూరం..మనం నేలపై కూర్చొని తినేటప్పుడు, ముఖ్యంగా సుఖాసనం లేదా అర్ధ పద్మాసనం వంటి భంగిమలో కూర్చున్నప్పుడు, శరీరం నిటారుగా ఉంటుంది. భోజనం తీసుకునేటప్పుడు మనం కొద్దిగా ముందుకు వంగి, తిరిగి వెనక్కి వస్తుంటాం. ఈ సహజమైన కదలిక వల్ల పొట్టలోని కండరాలు చురుగ్గా పనిచేస్తాయి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇలా తినడం వల్ల మెదడుకు కడుపు నిండింది అనే సంకేతాలు త్వరగా అందుతాయి. ఫలితంగా, మనం ఎక్కువగా తినకుండా ఉంటాం, ఇది బరువును అదుపులో ఉంచుతుంది.
మానసిక ప్రశాంతత, కుటుంబ అనుబంధం..నేలపై కూర్చొని తినడం(Eating) వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే చోట కూర్చుని భోజనం చేయడం వల్ల ఒకరికొకరు దగ్గరవుతారు, అనుబంధం బలపడుతుంది. ఇది మనసుకు ఆనందాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. సాంకేతికతతో దూరం పెరిగిన ఈ రోజుల్లో, ఇలా కలిసి కూర్చోవడం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది.అందుకే వీలయినప్పుడల్లా నేలమీద కూర్చుని తినడానికే ఇంపార్టెన్స్ ఇవ్వండి.