Memory: జ్ఞాపకశక్తి తగ్గిపోతోందా? అయితే ఈ ఫుడ్స్‌తో చెక్ పెట్టండి!

Memory:ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆధునిక జీవనశైలిలో మనం నిద్ర, వ్యాయామం, సరైన ఆహారంపై శ్రద్ధ పెట్టడం లేదు. దీని వల్ల మన మెదడు ఆరోగ్యం, ముఖ్యంగా జ్ఞాపకశక్తి(Memory) తీవ్రంగా దెబ్బతింటోంది. చిన్న వయసులోనే మతిమరుపు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెదడు పనితీరును మెరుగుపరిచి, జ్ఞాపకశక్తిని పెంచే కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.

Also Read: Literature: అర్మిలి

మెదడు ఆరోగ్యంగా ఉండటానికి, జ్ఞాపకశక్తి(Memory) పెరగడానికి ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా, క్యారెట్లు, స్ట్రాబెర్రీలు, యాపిల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. క్యారెట్లలోని బీటా కెరోటిన్, స్ట్రాబెర్రీలలోని ఫ్లేవోన్, యాపిల్స్‌లో ఉండే ఆంథోసైనిన్ వంటివి మెదడులోని నరాలను ఉత్తేజితం చేసి, దాని ఆరోగ్యాన్ని కాపాడతాయి.

memory

ఎర్ర ద్రాక్షలో కూడా ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇతర ద్రాక్ష రకాలతో పోలిస్తే ఎర్ర ద్రాక్షలో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే, స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ వంటి బెర్రీ పండ్లను రోజూ తినడం వల్ల అన్ని వయసుల వారిలోనూ జ్ఞాపకశక్తి గణనీయంగా పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. ఈ పండ్లలోని యాంథోసైనిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు మెదడులోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, మెమరీ పవర్‌ను పెంచుతాయి.

కమలా పండ్లు కూడా మెదడుకు అవసరమైన ఫ్లేవనాయిడ్స్‌ను అందిస్తాయి. ఇవి జలుబు, దగ్గు వంటి సాధారణ ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల మెదడుకు మంచి ఫ్లేవనాయిడ్స్ అందుతాయి. ఇక క్యాబేజీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఎర్ర క్యాబేజీలో ఉండే ఫ్లేవనాయిడ్స్ మెదడుకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. సోయాలో ఉండే ఫ్లేవనాయిడ్స్ రైనో వైరస్, ఇన్ఫ్లుఎంజా వంటి ప్రమాదకర వైరస్ల నుంచి మనల్ని కాపాడి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే జ్ఞాపకశక్తి(Memory) కూడా మెరుగుపడుతుందని గుర్తుంచుకోండి.

Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి మరో మాస్టర్ మైండ్..హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తాడా

Exit mobile version