
Literature
అర్మిలి
తెలవారిన తెలియట్లా
నడి రేయయినా నిదరట్లా
నీ తలపున నేనుంటే
రేయి పగలు ఒకటంటా..
ఎద చాటుకి కనుపాపకి
దారెట్టా తెలిసిందో
నీ పతిమను మోసుకొచ్చి
పదిలంగా దాచుకుంది..
నా మనసెరిగిన మతి ఎపుడూ
నీ జతనే కోరిందే
అది అతి మాత్రం అనుకోక
నా గతి మార్చే స్థితి తేవే..
మాటాడే కనులుంటే
మనసెట్టా దాస్తావే
నీ మౌనానికి భాషుంటే
ఆ లిపి నే రాస్తానే..
సరిజోడూ జతగాడూ
అని జనమంతా అంటారే
నా పక్కన నువ్వుంటే
ఈ లోకంనే కొంటానే..
నువ్వు లేని నా పయనం
శూన్యంగా తోస్తుందే
నీ జతగా నా జీవనం
సంపూర్ణం అవుతుందే..
నా జగతిని వెలిగించే
చందమామ నువ్వేలే
నీ వెలుగుల వరముకు వేచే
కలువ తపసిని నేనేలే..
ముద్దు మోములో ముగ్ధ నవ్వుతో
ఒక చిన్న ఆశీయవే
పొద్దుతిరుగుడు పువ్వులా
నిను చూస్తూ శ్వాసిస్తా
__ఫణి మండల
Superb phneeeeee…. Keep it up 👍
Nice
Simply superb 👏
Very nice.
భావ కవిత్వం సున్నితమైనది, సున్నితమైన భావాలు చక్కగా ప్రతిఫలించాయి, ప్రేయసి నీ హృదయం లో గొప్పగా నిలుపుకోవడం ఆమెను ఆరాధించడం అంతులేని అనురాగాన్ని చూపడం ప్రియుని ప్రేమకు నిదర్శనం. చక్కని పదాలతో భావాన్ని మర్మ గర్భంగా పలికించారు.
Very nice 👌
ఫని చాలా బాగొంది మళ్ళీ నిదురించిన ఆశలు శ్వాసి స్తున్నట్టుంది.
Very nice
Very Nice phani
వర్ణన చాలా బాగుంది
దేవులపల్లి ని గుర్తు చేశావ్. Superb 🌹🌹🌹
Superrrrrrrrrrrrrrrr
ఫణి మండల గారు మీ కలం నుండి జాలువారిన ఆర్మిలి ప్రేమ కవిత ప్రతి హృదయాన్ని హత్తుకొనేలా ఉంది. ప్రేమకు ప్రతి రూపమైన తన ప్రేయసి ఎల్లప్పుడూ తనతో తన జతగా తన హృదయంలోనే కొలువై ఉన్నదని ప్రియుడి మనోభావన వ్యక్తీకరించబడింది.మీ ఈ ప్రేమలేఖ ముగ్ధ మనోహరంగా ప్రకాశించాలని కోరుకుంటూ….