Curd: పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుందా, హాని చేస్తుందా?

Curd: కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పెరుగును ఎక్కువగా తినడం మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Curd

పెరుగు మన రోజువారీ భోజనంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది రుచిని పెంచడమే కాకుండా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పెరుగులో కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఎముకలను, దంతాలను బలోపేతం చేస్తుంది, అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, ఇది చర్మం జుట్టు సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది.

అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగు అందరికీ మంచిది కాకపోవచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పెరుగును ఎక్కువగా తినడం మానుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. పెరుగు అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.

curd

కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పెరుగును తమ ఆహారంలో చేర్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.అర్థరైటిస్ (కీళ్ల నొప్పుల)తో బాధపడేవారు పెరుగును అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి. రోజూ తింటే నొప్పులు మరింత పెరిగే అవకాశం ఉంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు, ముఖ్యంగా ఆస్తమా రోగులు పెరుగు( curd)కు దూరంగా ఉండాలి. ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే, రాత్రిపూట అస్సలు తినకూడదు.

లాక్టోస్ అసహనం (Lactose Intolerance)ఉన్నవారికి పెరుగు జీర్ణం కావడం కష్టం. దీనివల్ల కడుపు నొప్పి, డయేరియా వంటి సమస్యలు వస్తాయి.

curd

తరచుగా అసిడిటీ సమస్యతో బాధపడేవారు పెరుగుకు దూరంగా ఉండాలి. దీనికి బదులుగా, మజ్జిగ తాగడం చాలా మంచిది.

వైద్యులు ప్రత్యేకంగా రాత్రిపూట పెరుగు తినవద్దని ఈ సమస్యలు ఉన్నవారికి సలహా ఇస్తున్నారు. పెరుగులో ఉండే పోషకాలు, దాని స్వభావం కారణంగా కొన్ని శరీర తత్వాలకు ఇది సరిపడకపోవచ్చు.పెరుగు మన శరీరానికి ఒక అద్భుతమైన ఆహారమే అయినా, మీ ఆరోగ్య సమస్యలను బట్టి దానిని సరైన పద్ధతిలో తీసుకోవడం చాలా ముఖ్యం.

Photo:ఒక్క ఫోటో- ఒక చరిత్ర.. ప్రపంచం మర్చిపోని ఫోటోలు

Exit mobile version