Microwave: మైక్రోవేవ్ ఓవెన్‌లో వండిన ఆహారం..మంచిదా? కాదా?

Microwave:మైక్రోవేవ్ ఓవెన్‌లో వండిన ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే దానిపై చాలా చర్చ జరుగుతోంది. మరి దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు.

Microwave

ఈ బిజీ లైఫ్‌లో, వంట చేయడానికి సమయం లేని చాలా మందికి మైక్రోవేవ్ ఓవెన్ ఒక గొప్ప సౌకర్యంగా మారింది. ఇది ఆహారాన్ని వేడి చేయడానికి, పిజ్జాలు, బర్గర్‌ల వంటివి త్వరగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ, మైక్రోవేవ్ ఓవెన్‌లో వండిన ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే దానిపై చాలా చర్చ జరుగుతోంది. మరి దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు.

మైక్రోవేవ్ ఓవెన్(Microwave) ఎలా పనిచేస్తుందంటే...మైక్రోవేవ్ ఓవెన్ విద్యుదయస్కాంత కిరణాలను (electromagnetic waves) ఉపయోగించి ఆహారంలోని నీటి అణువులను వేడి చేస్తుంది. ఈ కిరణాలు ఆహారంలోని అణువులను కదిలించడం ద్వారా వేడి పుడుతుంది. దీనివల్ల ఆహారం చాలా వేగంగా వేడెక్కుతుంది.

Microwave

మైక్రోవేవ్(Microwave) ఆహారంతో ఆరోగ్య సమస్యలు..ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, మైక్రోవేవ్ ఓవెన్‌లో ఆహారాన్ని వేడి చేయడం వల్ల అందులోని ముఖ్యమైన విటమిన్లు , మినరల్స్ క్షీణిస్తాయి. ఉదాహరణకు, బ్రకోలీ వంటి కూరగాయలను మైక్రోవేవ్‌లో వేడి చేస్తే అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు 97% వరకు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా, ఓవెన్‌లో వండిన ఆహారం తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తికి కీలకమైన లింఫ్ నోడ్స్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..కొన్ని అధ్యయనాల ప్రకారం, మైక్రోవేవ్‌లో వేడి చేసిన ఆహారంలో రేడియేషన్ కొంతవరకు మిగిలిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని వేడి చేస్తే, ప్లాస్టిక్‌లోని హానికరమైన రసాయనాలు ఆహారంలో కలిసిపోవచ్చు. కూరగాయలను ఓవెన్‌లో వేడి చేస్తే అందులోని మినరల్స్ క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాలుగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందుకే, వీలైనంతవరకు మైక్రోవేవ్ ఓవెన్‌ను కేవలం ఆహారాన్ని వేడి చేయడానికి మాత్రమే ఉపయోగించడం మంచిది. ముఖ్యంగా ప్లాస్టిక్‌కు బదులుగా గాజు లేదా సిరామిక్ పాత్రలను వాడటానికి చూడాలి.

Salman Khan: గడ్డకట్టే చలిలో కష్టపడుతున్న సల్మాన్ ఖాన్

Exit mobile version