Loneliness: లోన్లీనెస్ వేధిస్తుందా? చెక్ పెట్టడం మీ చేతిలోనే ఉంది..

Loneliness: ఒంటరితనం అనేది ఒక చిన్న మానసిక స్థితి కాదు. ఇది జీవిత నాణ్యతను దెబ్బతీసే ఒక సైలెంట్ కిల్లర్

Loneliness

అంతా మనవాళ్లే అయినా కూడా మనసులో ఏదో తెలియని ఖాళీ. నలుగురిలో ఉన్నా ఒంటరితనం వెంటాడే విచిత్రమైన పరిస్థితి. ఇదే లోన్లీనెస్( Loneliness). ఇది కేవలం ఒక భావన కాదు, మనసుని, శరీరాన్ని బలహీనపరిచే ఒక నిశ్శబ్ద పోరాటం. మనసు లోలోపల మూగగా అరిచే ఈ ఒంటరితనాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం.

నగర జీవనశైలి, బిజీ షెడ్యూల్స్ వల్ల ఇప్పుడు చాలామంది ప్రజల మధ్య ఉన్నా కూడా ఒంటరితనం(Loneliness)తో బాధపడుతున్నారు. ఇది కేవలం ఒక భావన కాదు, ఇది ఒక తీవ్రమైన మానసిక ,శారీరక ఆరోగ్య సమస్య. నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే భావనతో కూడిన ఈ ఒంటరితనం మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.

ఒక వ్యక్తి బయటకు నవ్వుతూ, చురుగ్గా ఉన్నట్లు కనిపించినా, లోపల మాత్రం ఎవరితోనైనా తమ మనసులోని విషయాలను పంచుకోవాలని, తమకు విలువ ఇచ్చే వ్యక్తులు ఉండాలని కోరుకుంటారు. ఈ కోరిక నెరవేరనప్పుడు, అది మెల్లగా డిప్రెషన్, యాంగ్జైటీకి దారితీస్తుంది. ఫలితంగా, నిద్ర పట్టకపోవడం, ఏకాగ్రత తగ్గడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

సైకాలజీ పరిశోధనల ప్రకారం, ఒంటరితనం(Loneliness) అనుభవిస్తున్నప్పుడు మన మెదడులో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచి, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. బ్రెయిన్ స్కాన్ల ద్వారా, ఒంటరితనం ఉన్నవారిలో నిర్ణయాలు తీసుకునే మెదడు భాగం (prefrontal cortex) పనితీరు తగ్గినట్లు కూడా గుర్తించారు.

ముఖ్యంగా వృద్ధులు, కొత్త ప్రదేశాలకు మారినవారు, విద్యార్థులు, ఒంటరిగా జీవిస్తున్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులలో నిజమైన సంబంధాలు తగ్గిపోవడం వల్ల కూడా ఒంటరితనం పెరుగుతుంది.

Loneliness

ఉదాహరణకు..ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉద్యోగం కోసం పెద్ద సిటీకి వెళ్ళినప్పుడు, ఆఫీసులో చాలామంది ఉన్నా, పని ఒత్తిడి వల్ల ఇతరులతో దగ్గరి సంబంధాలు ఏర్పరచుకోలేకపోయాడు. గదికి వెళ్ళాక నిశ్శబ్దం అతడిని బాధిస్తూ ఉంటుంది. మొదట సర్దుకున్నా, ఆ తర్వాత నేను ఎందుకు ఇలా బతుకుతున్నాననిపించి నిద్ర, ఆహారంపై ఆసక్తి తగ్గిపోతుంది. చివరికి, ఒక మానసిక వైద్యుడిని సంప్రదించి, గ్రూప్ యాక్టివిటీస్‌లో చేరడం వల్ల క్రమంగా ఈ సమస్య నుంచి బయటపడ్డాడు.

ఇలా ఈ ఒంటరితనా(Loneliness)న్ని ఓవర్ కమ్ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఎవరితోనైనా కాసేపు అయినా మనసారా మాట్లాడటం, అభిరుచులలో మునిగిపోవడం (పెయింటింగ్, సంగీతం, పుస్తకాలు చదవడం), వాలంటీర్ పనులు చేయడం వంటివి సహాయపడతాయి. సోషల్ మీడియాలోని వర్చువల్ సంబంధాల కంటే, నిజమైన సంభాషణలపై దృష్టి పెట్టడం ముఖ్యం. అవసరమైతే సైకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

ఒంటరితనం అనేది ఒక చిన్న మానసిక స్థితి కాదు. ఇది జీవిత నాణ్యతను దెబ్బతీసే ఒక సైలెంట్ కిల్లర్. దీనిని సకాలంలో మీరే గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటే జీవితం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version