Nail biting:గోళ్లు కొరికే అలవాటుందా? అయితే ప్రమాదంలో పడుతున్నట్లే

Nail biting: ఆందోళనగా ఉన్నప్పుడు లేదా ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు కొంతమంది తెలియకుండానే గోళ్లను కొరుకుతుంటారు.

Nail biting

గోళ్లు కొరికే (Nail Biting) అలవాటు చాలా మందిలో ఉంటుంది. చిన్న వయస్సులో మొదలైన ఈ అలవాటు కొందరిని పెద్దయ్యాక కూడా కొనసాగిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆందోళనగా ఉన్నప్పుడు లేదా ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు తెలియకుండానే గోళ్లను కొరుకుతుంటారు. అయితే, ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ గోళ్లు కొరకడం ద్వారా పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

గోళ్లను కొరకడం(Nail biting) వలన నోటి ద్వారా చేతులపై ఉండే క్రిములు, బ్యాక్టీరియా, దుమ్ము నేరుగా కడుపులోకి చేరతాయి. దీనివల్ల జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాక, నిరంతరం గోళ్లు కొరకడం వలన దంతాలు దెబ్బతినడం, చిగుళ్ల సమస్యలు కూడా తలెత్తొచ్చు.

గోళ్లు కొరకడాని(Nail biting)కి ప్రధాన కారణాలలో మానసిక ఆందోళన, ఒత్తిడి (Stress), కాల్షియం లోపం ముఖ్యమైనవి.

Nail biting

కాల్షియం లోపం: కాల్షియం లోపం కారణంగా గోళ్లు కొరకడం అలవాటవుతుంది. ఈ సమయంలో కాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి.ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం వంటి వాటిని ప్రయత్నించడం మంచిది.

గోళ్లు కొరకాలని అనిపించినప్పుడు వెంటనే ఆలోచనలను దారి మళ్లించడం మేలు. పని మీద పూర్తి ధ్యాస పెట్టడం లేదా చేతులతో వేరే పని చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటును మానుకోవాలని బలంగా నిర్ణయించుకోవడం మొదటి మెట్టు.

గోళ్లను కొరికే అలవాటు మానుకోవాలంటే ముందుగా చేయాల్సింది వాటిని కత్తిరించుకోవడం (Trimming). గోళ్లు పొట్టిగా ఉండటం వల్ల కొరకడానికి వీలు కాదు. వీలైనంత వరకు చేతి వేళ్లకు గోళ్లు లేకుండా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకోవటం మంచిది. చిన్న పిల్లల విషయంలో వారి గోళ్లను పూర్తిగా కత్తిరించేయడం, లేదా గోళ్లు కొరకకుండా వేప/కాకర రసం వంటి చేదు పదార్థాలను వేళ్లకు రాయడం వంటివి చేయాలి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version