Stress: స్ట్రెస్ పెరిగిపోయిందా? మనసు, శరీరం కుదేలవకుండా ఇలా జాగ్రత్త పడండి!

Stress:స్ట్రెస్ తక్కువ ఉన్నప్పుడు అది మనల్ని చురుకుగా ఉంచినా, ఎక్కువయితే మాత్రం మనసు, శరీరం రెండూ కుదేలైపోతాయి. అందుకే దీనికోసం స్ట్రెస్ మేనేజ్మెంట్ చిట్కాలు పాటిస్తే అన్నీ సెట్ అవుతాయని అంటున్నారు నిపుణులు.

Stress

మనందరి జీవితం ఒక మారథాన్ రేస్ లాంటిదే. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక టెన్షన్ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆఫీస్ డెడ్‌లైన్లు, ఇంటి బాధ్యతలు, ట్రాఫిక్ సమస్యలు… ఇవన్నీ మనపై ఎప్పుడూ టెన్షన్‌ను ఒత్తిడిని పెంచుతాయి. ఈ ఒత్తిడే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒత్తిడి తక్కువ ఉన్నప్పుడు అది మనల్ని చురుకుగా ఉంచినా, ఎక్కువయితే మాత్రం మనసు, శరీరం రెండూ కుదేలైపోతాయి. అందుకే దీనికోసం స్ట్రెస్ మేనేజ్మెంట్ చిట్కాలు పాటిస్తే అన్నీ సెట్ అవుతాయని అంటున్నారు నిపుణులు.

ఒత్తిడి (Stress)పెరిగినప్పుడు మన శరీరంలో అడ్రినలిన్, కార్టిసోల్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు మన హార్ట్ బీట్ వేగాన్ని, రక్తపోటును పెంచుతాయి. ఇది మెదడులో ఆందోళన కలిగించే రసాయనాలను విడుదల చేస్తుంది. ఈ పరిస్థితి రోజూ కొనసాగితే, అది మన మానసిక ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. అంతేకాకుండా, జీర్ణ సమస్యలు, తరచుగా తలనొప్పి, హై బీపీ, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

Stress

ఒత్తిడి (Stress)పెరిగినప్పుడు ఎప్పుడూ టెన్షన్‌గా, ఆందోళనగా ఉండటం, సరైన నిద్ర లేకపోవడం లేదా అతిగా నిద్రపోవడం, ఏ పనిపైనా ఆసక్తి చూపకపోవడం, చిన్న విషయాలకే కోపం రావడం, శరీరం నిరంతరం అలసటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అయితే ఒత్తిడి(Stress)ని తగ్గించుకోవడానికి కొన్ని శాస్త్రీయంగా నిరూపితమైన పద్ధతులు ఉన్నాయి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా యోగా చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. అలాగే డీప్ బ్రీతింగ్ తీసుకోవడం సాధన చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకు నచ్చిన హాబీల్లో కొంత సమయం కేటాయించడం, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం మానసిక బలాన్ని ఇస్తుంది. మెదడును రిలాక్స్ చేసే మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.అలాగే మీకు నచ్చిన పనులు చేయడం మ్యూజిక్ వినడం, సినిమాలు చూడటం, ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం వంటివి చేసిన స్ట్రెస్ కాస్త తగ్గుతుంది.

ముఖ్యంగా అన్నింటికీ ఒప్పుకోవడం మానేసి, నో అని చెప్పడం నేర్చుకోవాలి. పనికి ప్రాధాన్యత ఇస్తూ సమయాన్ని సరిగా నిర్వహించుకోవడం ద్వారా చాలా ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడిని పూర్తిగా జీవితం నుంచి తొలగించలేము, కానీ దానిని ఎలా నిర్వహించాలో నేర్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. మనసు శాంతిగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుందనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version