Air fryers
ఆరోగ్యకరమైన ఆహారం కోసం కొందరు ఎక్కువగా వాడుతున్న ఎయిర్ ఫ్రైయర్స్ (Air Fryers) గురించి నిపుణులు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నూనె లేకుండా ఆహారం సిద్ధం చేయడం వల్ల వీటిని ఎక్కువ మంది ఇష్టపడుతున్నా కూడా, వీటిని అధిక ఉష్ణోగ్రత వద్ద వాడటం వలన ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అక్రిలామైడ్‌లు – ప్రమాదకర సమ్మేళనాలు..
నిజానికి, ఎయిర్ ఫ్రైయర్స్ నేరుగా క్యాన్సర్‌కు కారణం కావు. కానీ, అధిక ఉష్ణోగ్రత వద్ద వీటిని ఉపయోగించినప్పుడు కొన్ని హానికరమైన సమ్మేళనాలు విడుదలవుతాయి. వీటినే అక్రిలామైడ్‌లు (Acrylamides) అని పిలుస్తారు. ఇవి క్యాన్సర్ కారకాలుగా పనిచేసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జీవనశైలి మార్పులు, ఆధునిక పరికరాల వినియోగం కారణంగా క్యాన్సర్ ప్రమాదం పెరుగుతోంది. ఇందులో ఎయిర్ ఫ్రైయర్స్ పాత్ర కూడా ఉండవచ్చు. దీనికి ప్రధాన కారణాలు..చాలా ఎయిర్ ఫ్రైయర్స్ నాన్-స్టిక్ (Non-Stick) పూతతో తయారై ఉంటాయి.
అధిక వేడికి నాన్-స్టిక్ పూత విషపూరితమైన పొగలను (Toxic Fumes) విడుదల చేస్తుంది. ఈ సమ్మేళనాలు ఆహారంలోకి చేరి, దానిని విషపూరితం (Toxic)గా మార్చే ప్రమాదం ఉంది.
దీర్ఘకాలంగా ఈ పూతను ఉపయోగించడం వలన కాలేయ , మూత్రపిండాల సమస్యలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వంట చేసేటప్పుడు ఎయిర్ ఫ్రైయర్‌లు అక్రిలామైడ్‌లు, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (Polycyclic Aromatic Hydrocarbons) వంటి క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తాయి. ముఖ్యంగా తృణధాన్యాలు (Grains),బంగాళాదుంపలు (Potatoes),మాంసం (Meat),గుడ్లు (Eggs), చేపలు (Fish) వంటి పదార్థాలను వండినప్పుడు ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఎయిర్ ఫ్రైయర్స్(Air fryers) వాడేవారు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి నిపుణులు కొన్ని ముఖ్యమైన చిట్కాలు సూచించారు. సిరామిక్ (Ceramic) లేదా స్టీల్ (Steel) పూతతో ఉన్న ఎయిర్ ఫ్రైయర్‌లను కొనుగోలు చేయండి. ఎయిర్ ఫ్రైయర్‌ను ఉపయోగించేటప్పుడు తక్కువ ఉష్ణోగ్రత (Lower Temperature) పై వంట చేయండి.ఆహారం కోసం అర టీస్పూన్ నూనె మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యకరమైన ఆహార విధానంలో ఎయిర్ ఫ్రైయర్స్ మంచివే అయినా కూడా, వాటి తయారీ, వాడే విధానంలో జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు.