Overthinking
మనిషి మెదడు అద్భుతమైన సృజనాత్మక శక్తి కలిగిన ఒక మెషీన్. కానీ, దానిని సరిగ్గా కంట్రోల్ చేయకపోతే, అదే మనల్ని ఆలోచనల ఉచ్చులో (Overthinking) పడేస్తుంది. చిన్నపాటి సమస్యను కూడా ఒక పెద్ద పర్వతంగా మార్చేసే ఈ మానసిక పరిస్థితి మన జీవితంలో ఆనందాన్ని, ప్రశాంతతను దూరం చేస్తుంది. నిజ జీవితంలో ఈ ఓవర్‌థింకింగ్ ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో కొన్ని ఉదాహరణలతో చూద్దాం.
ఓవర్‌థింకింగ్ (Overthinking)వల్ల కలిగే నష్టాలు ఉదాహరణలతో చూద్దాం:
జాబ్ ఇంటర్వ్యూ భయం (Job Interview Syndrome)..సునీత ఒక మల్టీ నేషనల్ కంపెనీలో (MNC) ఇంటర్వ్యూకి సిద్ధమైంది. నా ఇంగ్లీష్ బాగోలేదంటే ఏం జరుగుతుంది? వాళ్లు నా బ్యాక్ గ్రౌండ్ గురించి అడిగితే ఎలా చెప్పాలి?” అని తనలో తానే వంద రకాల ప్రశ్నలు వేసుకుంటూ, సమాధానాలను రిహార్సల్ చేసింది. చివరికి, అసలు ఇంటర్వ్యూలో సులభమైన ప్రశ్నలకే భయంతో తడబడటంతో ఆమెకు ఆ ఉద్యోగం రాలేదు. ఓవర్‌థింకింగ్ వల్ల ఆమె సామర్థ్యం ఉన్నా కూడా ఛాన్స్ కోల్పోయింది.
Potato: తొక్కలో ఆలుగడ్డ ఫోటోను తొమ్మిది కోట్లకు కొన్నారా.. !
బంధాలలో అనుమానాలు (Relationship Doubts)..రాహుల్ తన స్నేహితురాలికి వాట్సాప్‌లో ఒక టెక్స్ట్ పంపాడు. హాయ్, ఎలా ఉన్నావ్? అని పంపితే, అది చూసినట్లు బ్లూ టిక్ వచ్చినా వెంటనే జవాబు రాలేదు. ఆ ఒక్క గంటలో అతని మనసు ఒక పెద్ద సినిమానే తీసింది. బహుశా, తను ఇంకెవరితోనో మాట్లాడుతుందేమో? నాపై కోపంగా ఉందా? లేదా నన్ను పట్టించుకోవడం లేదా? ఇలా రకరకాలుగా ఆలోచించి,కాసేపట్లోనే నెర్వస్‌గా, కోపంగా మారిపోయాడు. ఆమె ఫోన్ చార్జింగ్ అయిపోయిందని గంట తర్వాత తెలిసింది. ఓవర్‌థింకింగ్ వల్ల ఒక చిన్న విషయం ఎంతటి మానసిక క్షోభను కలిగించిందో ఇది చూపిస్తుంది.
పనిలో సందేహాలు (Office Decisions)..ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మధు, తన టీమ్ మీటింగ్‌లో ఒక ఐడియా చెప్పాలా వద్దా అని తీవ్రంగా ఆలోచించాడు. ఒకవేళ అది తప్పు అయితే? నా కొలీగ్స్ నవ్వుతారా? నా బాస్ నన్ను తక్కువగా అంచనా వేస్తాడా?” అని ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నాడు. రెండు వారాల తర్వాత అదే ఆలోచనను మరొక సహోద్యోగి చెప్పగా, బాస్ అతడిని పొగిడాడు. ఓవర్‌థింకింగ్ వల్ల ఒక విలువైన అవకాశం చేజారిపోయింది.
ఓవర్‌థింకింగ్(Overthinking)కు సైన్స్ కారణాలు (Scientific Reasons)..ఈ ఆలోచనల ఉచ్చు వెనుక మానసిక , శారీరక కారణాలు ఉన్నాయి. మెదడులోని ఎమిగ్డలా (Amygdala) అనే భాగం భయాన్ని అతిగా ప్రేరేపిస్తుంది. అదే సమయంలో, నిర్ణయాలు తీసుకునే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ (Prefrontal Cortex) గందరగోళానికి లోనవుతుంది. మెదడులో స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ (Cortisol) ఎక్కువై, నిద్ర, ఆరోగ్యం, రోగనిరోధక శక్తి అన్నీ తగ్గిపోతాయి.
ఓవర్ థింకింగ్‌కి చెక్ పెట్టే 3 సింపుల్ స్టెప్స్.. డెడ్‌లైన్ పెట్టుకో అంటే ఒక సమస్యపై ఎంత టైమ్ ఆలోచించాలో ఫిక్స్ చేయి.అలాగే ఆ ప్రశ్నలు మైండ్ లో తిప్పుకోకుండా నోట్‌బుక్‌లో రాసి తర్వాత చింపి అవతల పడేయి కాస్త రిలీఫ్ దొరుకుతుంది. వీటితో పాటు బాడీ రీసెట్ చేసుకోవాలి. వాకింగ్ వెళ్లడం, సంగీతం వినడం, లేదా స్నేహితులతో మాట్లాడటం లాంటివి మనసును మళ్లిస్తాయి.
ఓవర్‌థింకింగ్(Overthinking) అనేది ఫ్యాన్‌ను ఆపకుండా గదిలోని దుమ్మును ఊడ్చడం లాంటిది. ఇది మనసును అలసిపోయేలా చేస్తుంది, కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిజమైన శక్తి ఆలోచనలో కాదు, ఆ ఆలోచనను ఆచరణలోకి మార్చడంలోనే ఉంది.. అది కాస్త ఎక్కువగా రన్ అవుతోంది .. దానికి చిన్న బ్రేక్, క్లారిటీ, యాక్షన్ ఇస్తే సరిపోతుంది.