Silent retreat:సైలెన్స్ రిట్రీట్‌ చేసి ప్రశాంతతను వెతుకుదామా?

Silent retreat: డిజిటల్ అలజడి నుంచి బయటపడటానికి, 'డిజిటల్ డిటాక్స్', 'సైలెన్స్ రిట్రీట్‌లు'అనే ట్రెండ్ ఇప్పుడు స్పీడ్ పెరిగింది.

Silent retreat

ప్రపంచంలో ఎప్పుడూ వినిపించే అత్యంత పెద్ద శబ్దం(Silent retreat) ఏదంటే, అది డౌట్ లేకుండా మన డిజిటల్ నోయిస్ (Digital Noise) అనే చెబుతాం. గంటకోసారి వచ్చే నోటిఫికేషన్లు, ఎప్పుడూ చూసే సోషల్ మీడియా ఫీడ్‌లు, మెయిల్స్, వాట్సాప్ చాట్‌లు… ఇవన్నీ మన మనస్సును నిరంతరం ఆక్రమిస్తాయి. ఈ డిజిటల్ అలజడి నుంచి బయటపడటానికి, ‘డిజిటల్ డిటాక్స్’ (Digital Detox) , ‘సైలెన్స్ రిట్రీట్‌లు’ (Silence Retreats) అనే ట్రెండ్ ఇప్పుడు స్పీడ్ పెరిగింది.

డిజిటల్ డిటాక్స్ అంటే ఏమిటి?.. ఒక నిర్ణీత కాల వ్యవధి (ఉదాహరణకు, ఒక రోజు లేదా ఒక వారం) పాటు ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్‌ల వంటి అన్ని డిజిటల్ పరికరాలకు పూర్తిగా దూరంగా ఉండటం. ఈ సమయంలో మనస్సును డిజిటల్ అలజడి నుంచి విముక్తి చేసి, నిజ జీవితంపై దృష్టి పెట్టడమే దీని ముఖ్య లక్ష్యం.

‘సైలెన్స్ రిట్రీట్(Silent retreat)’ ప్రత్యేకత.. డిజిటల్ డిటాక్స్‌లో తదుపరి స్థాయి సైలెన్స్ రిట్రీట్‌లు. ఇవి సాధారణంగా ఏదైనా ప్రశాంతమైన ప్రదేశంలో నిర్వహించబడతాయి.

ఈ రిట్రీట్‌ల(Silent retreat)లో పాల్గొనేవారు కొన్ని గంటలు లేదా రోజులు పూర్తి నిశ్శబ్దంలో గడుపుతారు. మాట్లాడటం, రాయడం, చదవడం వంటి వాటికి కూడా దూరంగా ఉంటారు.

బాహ్య ప్రపంచం నుంచి ఎలాంటి ఉద్దీపన (Stimulation) లేకుండా, కేవలం తమ అంతరంగంతో మాత్రమే కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇది మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతను పెంచుతుంది.

Silent retreat

ఎందుకు ఇది అవసరం అంటే అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి. అంటే మన మనస్సులో నిరంతరం వచ్చే అనవసరమైన ఆలోచనలకు ప్రధాన కారణం బయటి నుంచి వచ్చే డిజిటల్ సమాచారమే. డిటాక్స్ ద్వారా ఆ ఆలోచనల ప్రవాహం తగ్గి, మనస్సు తేలికపడుతుంది.

రెగ్యులర్‌గా ఫోన్ చెక్ చేయడం వల్ల మన పనిపై ఏకాగ్రత దెబ్బతింటుతుంది. డిటాక్స్ తర్వాత తిరిగి పనిలోకి వెళ్లినప్పుడు, ఫోకస్ అండ్ ప్రొడక్టవిటీ చాలా పెరుగుతుంది.

రాత్రి పడుకునే ముందు స్క్రీన్ టైమ్‌కు దూరంగా ఉండటం వల్ల మెదడు త్వరగా విశ్రాంతి మోడ్‌లోకి వెళ్తుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో, ప్రకృతితో కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు.

Silent retreat (2)

మొదట చిన్నగా మొదలుపెట్టొచ్చు. ప్రతి రోజు నిద్ర లేవగానే మొదటి గంట, అలాగే పడుకునే ముందు చివరి గంట ఫోన్‌ను పక్కన పెట్టండి. నెమ్మదిగా, వారంలో ఒక రోజు (ఉదాహరణకు, ఆదివారం) ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసి, కేవలం ప్రకృతితో లేదా ఏదైనా హాబీతో సమయాన్ని గడపండి. ఈ అలవాటు మనస్సుకు ఒక అద్భుతమైన రీ-బూట్ బటన్ లాగా పనిచేస్తుంది.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version