Glaucoma: సైలెంట్ కిల్లర్ గ్లాకోమా .. ముందే అలర్ట్ అవ్వండి

Glaucoma: ఎలాంటి నొప్పి లేకుండా, ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా, శాశ్వతమైన చీకటిలోకి నెట్టేస్తుంది.

Glaucoma

రోజంతా ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ… మన జీవితంలో స్క్రీన్ టైమ్ అంతకంతకూ పెరిగిపోతోంది. మనం గమనించకుండానే, మన కళ్ళపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. ఎందుకంటే, మన కంటికి తెలియకుండానే ఒక శత్రువు దాగి ఉంది. అది సైలెంట్‌గా మన చూపును దొంగిలిస్తుంది. ఎలాంటి నొప్పి లేకుండా, ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా, శాశ్వతమైన చీకటిలోకి నెట్టేస్తుంది. దాని పేరు గ్లాకోమా(glaucoma). ఈ భయంకరమైన వ్యాధి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న నానుడి మన జీవితంలో కంటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కానీ నేటి జీవనశైలి, కాలుష్యం, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా కంటిపై చాలా ఎక్కువ ప్రభావం పడుతోంది. కంటికి వచ్చే అనేక వ్యాధుల్లో ఒకటి గ్లాకోమా. ఈ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా శాశ్వత అంధత్వానికి దారి తీసే అవకాశం ఉంది.

Glaucoma

గ్లాకోమా అంటే ఏంటంటే.. గ్లాకోమా(glaucoma) అనేది కంటిలో పెరిగే ఒత్తిడి కారణంగా ఆప్టిక్ నరాలు దెబ్బతినే ఒక తీవ్రమైన వ్యాధి. కంటి ముందు భాగంలో అదనపు ద్రవం పేరుకుపోవడం వల్ల ఈ ఒత్తిడి పెరుగుతుంది. ఈ వ్యాధిలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి: ఓపెన్-యాంగిల్ గ్లాకోమా , యాంగిల్-క్లోజర్ గ్లాకోమా.

లక్షణాలు, కారణాలు..గ్లాకోమా(glaucoma)ను ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. కంటిలో ఎరుపుదనం, దురద, నొప్పి, దృష్టి మసకబారడం, కాంతి చుట్టూ రంగుల వలయాలు కనిపించడం, వికారం, వాంతులు వంటివి గ్లాకోమా లక్షణాలు కావచ్చు. సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం, అదే పనిగా కాంతిని చూడడం, వయసు పెరగడం, డయాబెటిస్, వంశపారంపర్యంగా రావడం, మరియు ఇతర కంటి సమస్యలు గ్లాకోమాకు ప్రధాన కారణాలు.

నిర్ధారణ, చికిత్స..గ్లాకోమాను సాధారణ కంటి పరీక్ష, టొనోమెట్రీ, మరియు విజువల్ ఫీల్డ్ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తారు. సమస్య తీవ్రతను బట్టి, డాక్టర్లు స్టెరాయిడ్ వంటి కంటి చుక్కలను లేదా లేజర్/శస్త్రచికిత్సను సిఫార్సు చేస్తారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు.

Trump: ట్రంప్ పగ: రష్యా, చైనాలతో పాటు భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు

Exit mobile version