Health
ఆహారం కేవలం కడుపు నింపడానికి మాత్రమే కాదు, మన శరీరానికి, మెదడుకు శక్తినిచ్చే ఇంధనం. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది, అండ్ మనసు ప్రశాంతంగా ఉంటుంది.
- అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బరువు పెరగడం, అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే సమతుల్యమైన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
- రోజూ వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి. వీటిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి.
- కండరాల పెరుగుదలకు, శరీర నిర్మాణానికి ప్రోటీన్ చాలా అవసరం. పప్పులు, పాలు, గుడ్లు, చేపలు, మాంసం వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.
- బ్రౌన్ రైస్, రాగి, జొన్నలు, సజ్జలు వంటి వాటిలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
- రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
- జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, స్ట్రీట్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
- సరైన ఆహారంతో మన శరీరం ఆరోగ్యంగా(Health) ఉంటే, మనసు కూడా ఉత్సాహంగా ఉంటుంది.