Toxic air:ఢిల్లీలో కల్లోలం రేపుతున్న విషపు గాలి ..దీనికి పరిష్కారం లేదా?

Toxic air: గాలి నాణ్యత మెరుగుపడే వరకు చిన్న పిల్లలు స్కూళ్లకు రాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Toxic air

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత(Toxic air) అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రతి ఏటా చలికాలంలో నగరవాసులను వేధించే వాయు కాలుష్యం ఈసారి రికార్డు స్థాయికి పడిపోయింది. గాలి నాణ్యత సూచీ (AQI) 450 మార్కును దాటి సీవియర్ కేటగిరీలో కొనసాగుతోంది. గాలి(Toxic air)లో పేరుకుపోయిన విషతుల్యమైన కణాలు ప్రజల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ గడ్డు పరిస్థితుల్లో నగరాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.

చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని నిర్ణయించిన ఢిల్లీ ప్రభుత్వం, ప్రాథమిక పాఠశాలల నిర్వహణపై కీలక మార్పులు చేసింది. నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఫిజికల్ క్లాసులను రద్దు చేసి, పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే పాఠాలు బోధించాలని ఆదేశించింది.

ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. కేవలం బోర్డు పరీక్షలు ఉన్న పెద్ద తరగతుల విద్యార్థులకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. గాలి నాణ్యత మెరుగుపడే వరకు చిన్న పిల్లలు స్కూళ్లకు రాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నగరంలో కాలుష్యం (Toxic air)పెరగడం వల్ల ఆఫీసులకు వెళ్లే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ప్రైవేటు కంపెనీలు తమ సిబ్బందికి వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Toxic air

చాలా ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని కోరుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా 50 శాతం మంది సిబ్బందిని మాత్రమే ఆఫీసుకు పిలిచే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. దీనివల్ల రోడ్లపై వాహనాల రద్దీ తగ్గి, కాలుష్యం కొంతవరకు తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఢిల్లీ ప్రజలు గాలి పీల్చడమే ఒక పెద్ద సవాలుగా మారింది. ఉదయం పూట దట్టమైన పొగమంచు , కాలుష్యం కలిసి ఉండటం వల్ల కళ్లు మండటం, గొంతు నొప్పి , శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ముఖ్యంగా వృద్ధులు , శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ ధరించకుండా బయట తిరగడం ఏమాత్రం క్షేమం కాదని, ఇంట్లో కూడా ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడుకోవాలని సూచిస్తున్నారు.

ప్రభుత్వం గ్రేడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద నాల్గవ దశ ఆంక్షలను అమలు చేస్తోంది. దీని ప్రకారం నగరంలోకి డీజిల్ వాహనాల ప్రవేశంపై కఠిన నిషేధం విధించారు. నిర్మాణ పనులను పూర్తిగా నిలిపివేయడంతో పాటు, రోడ్లపై దుమ్ము లేవకుండా నీటిని చల్లుతున్నారు.

యాంటీ స్మాగ్ గన్ల ద్వారా గాలిలోని కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం తగ్గించే వరకు ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరకదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version