Happiness:సంతోషం కోసం ఎంత వెతికితే అంత పారిపోతుంది..ఎందుకో తెలుసా?

Happiness:సైకాలజీలో ఒక ఆసక్తికరమైన సిద్ధాంతం ఉంది. దానినే హ్యాపీనెస్ పారడాక్స్(Happiness Paradox) అంటారు. అంటే, సంతోషం కోసం మనం ఎంతగా వెతికితే, అది అంతగా మన నుంచి దూరం వెళ్లిపోతుంది అని దాని అర్థం.

Happiness

మనిషి జీవితంలో ప్రతి ఒక్కరూ వెతుక్కునే ఒకే ఒక్క లక్ష్యం – సంతోషం. కానీ, సైకాలజీలో ఒక ఆసక్తికరమైన సిద్ధాంతం ఉంది. దానినే హ్యాపీనెస్ పారడాక్స్(Happiness Paradox) అంటారు. అంటే, సంతోషంకోసం మనం ఎంతగా వెతికితే, అది అంతగా మన నుంచి దూరం వెళ్లిపోతుంది అని దాని అర్థం.

సంతోషం గురించి పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే…ఒక వ్యక్తి నేను సంతోషంగా ఉన్నానా లేదా?” అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటే, మెదడులో ఒత్తిడి ప్రతిస్పందనలు మొదలవుతాయి. ఇలా అతిగా ఆలోచించడం వల్ల సంతృప్తి అనేది తగ్గిపోతుంది. మనసు ఎప్పుడూ ఆలోచనల్లోనే మునిగిపోతుంది.

ఒక విహారయాత్రకు వెళ్తే చాలా సంతోషం(happiness)గా ఉంటామని మనం అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్లాక, ఇంకా ఆనందంగా లేదు, ఇంకో వినోదం కోల్పోయాం అని అనుకుంటే, ఆనందం తగ్గిపోతుంది. ఇక్కడ మన అంచనాలు ఎక్కువైతే, సంతోషం తగ్గిపోతుంది.

Happiness

ఎవరైనా తమ సోషల్ మీడియాలో జీవితం చాలా సంతోషం(happiness)గా ఉంది అని చెబుతూ ఫోటో షేర్ చేస్తే..చూసేవారిలో అభద్రతాభావం పెరుగుతుంది. నాకేమీ సంతోషం దొరకడం లేదన్న ఫీలింగ్‌లోకి వెళ్లిపోతారు. ఇలా వెళ్లారంటే అది హ్యాపీనెస్ పారడాక్స్ కు ఒక ఉదాహరణ.అలాగే జాబ్‌లో ఒక పెద్ద పదవి వచ్చినా ఇంకా ఎక్కువ జీతం రావాలి, ఇంకా ఎక్కువ గుర్తింపు రావాలి అని ఎక్కువ ఆశపడితే మనకు సంతృప్తి దొరకదు.

రిలేషన్ షిప్ విషయానికి వస్తే.. కొత్త సంబంధంలో ఉన్నప్పుడు, ఇద్దరూ ప్రతిరోజు ప్రేమగా, జాలీగా ఉండాలని ఆశిస్తారు. కానీ నిజ జీవితంలో చిన్న చిన్న గొడవలు, పని ఒత్తిడి వస్తాయి. అప్పుడు మన ప్రేమ తగ్గిపోతోందా? అని అనవసరమైన అనుమానాలు మొదలవుతాయి. ఎంత ఆనందంగా ఉండాలి అని పట్టుబడితే, అంత అసంతృప్తి వస్తుంది.

బంధాల్లో ఈ వైరుధ్యాన్ని ఎలా నివారించాలి అంటే..చిన్న క్షణాలను ఆనందిండం నేర్చుకోవాలి. కలిసి కాఫీ తాగడం, సరదాగా మాట్లాడుకోవడం… ఇవే నిజమైన బంధాన్ని బలోపేతం చేస్తాయి. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా 24 గంటలు సంతోషంగా ఉండాలని అనుకోవడం సరికాదు. చిన్న గొడవలు కూడా బంధంలో ఒక భాగమే.భాగస్వామితో ఉన్నప్పుడు ఎలా మెప్పించాలి అని కాకుండా, నిజంగా వారి మాట వినడం, కనెక్ట్ అవ్వడం వల్లే నిజమైన సంతోషం వస్తుంది.

మొత్తంగా సంతోషాన్ని(happiness )ఎలా పొందాలి అంటే..వర్తమానంలో జీవించడం అంటే ఈ క్షణంలో మనకున్న చిన్న చిన్న ఆనందాలపై దృష్టి పెట్టాలి.రోజూ ఉదయం మనకు ఉన్న మూడు చిన్న విషయాలకు కృతజ్ఞతలు చెప్పుకుంటే, మన మెదడు సానుకూలంగా మారుతుంది. ఇతరుల జీవితంతో పోల్చుకోకుండా, మన అభివృద్ధిని మాత్రమే మనం చూసుకోవాలి. మొత్తానికి, సంతోషం అనేది ఒక నీడ లాంటిది. దాన్ని వెంబడిస్తే అది దొరకదు. కానీ, మనం అర్థవంతమైన పనులు చేస్తున్నప్పుడు అది స్వయంగా మన దగ్గరికి వస్తుంది.

Bigg Boss : బిగ్ బాస్‌లో గుడ్డు గేమ్ స్ట్రాటజీ..సంజన వల్ల నష్టపోయిన భరణి

Exit mobile version