Hair dye: హెయిర్ డై వేసుకునేవారు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

Hair dye: కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోకపోతే, అందం కోసం వేసుకునే హెయిడ్ డై  జుట్టుకు మరింత హాని కలిగించొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Hair dye

మనలో చాలామందికి తలపై ఒక్క తెల్ల వెంట్రుక కనిపించినా గుండె ఆగినంత పనవుతుంది. అయితే, మారిన జీవనశైలి, కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల తెల్లజుట్టు ఇప్పుడు టీనేజీ నుంచే మొదలవుతున్న సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కోసం కొందరు హెయిర్ డై(Hair dye)లకు మొగ్గు చూపితే, మరికొందరు ఫ్యాషన్ పేరుతో రంగులు వేసుకుంటున్నారు. అయితే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోకపోతే, అందం కోసం చేసే ఈ ప్రయత్నం జుట్టుకు మరింత హాని కలిగించొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రాచీన కాలం నుంచి భారతీయులు తమ నల్లని జుట్టు కోసం ఎంతో తాపత్రయపడ్డారు. అప్పట్లో హెన్నా, ఇండిగో వంటి సహజసిద్ధమైన పదార్థాలతో పాటు, ఆముదం, నువ్వుల నూనెలను ఉపయోగించేవారు. అయితే, ఇప్పుడు సింథటిక్ హెయిర్ డైలు తక్షణ పరిష్కారం చూపిస్తున్నా, వాటిలో ఉండే రసాయనాలు జుట్టుకు, ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Hair dye

డై (Hair dye)లలో ఉండే అమ్మోనియా, పీపీడీ, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలు జుట్టులోని సహజ నూనెలను తొలగించి, జుట్టు పొడిబారడం, రాలడం, చిట్లడం వంటి సమస్యలను సృష్టిస్తాయని చర్మవ్యాధి నిపుణులు వివరిస్తున్నారు. అంతేకాకుండా, సున్నితమైన చర్మం కలవారికి అలర్జీలు, దురద, దద్దుర్లు, ముఖంపై పిగ్మెంటేషన్ వంటి సమస్యలు కూడా తలెత్తొచ్చని హెచ్చరిస్తున్నారు.

హెయిర్ డై వేసుకునే ముందు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వీలైనంత వరకు హెన్నా వంటి సహజ పదార్థాలను ఉపయోగించడం ఉత్తమం. తప్పనిసరై రసాయన డైలను వాడాల్సి వస్తే, సల్ఫేట్లు, అమ్మోనియా, పెరాక్సైడ్, పీపీడీ లేని ఉత్పత్తులను ఎంచుకోవాలి.

డై (Hair dye)వేసుకునే ముందు చెవి వెనుక భాగంలో లేదా జుట్టు లోపల కొద్దిగా వేసి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. 48 గంటల పాటు ఎలాంటి ప్రతికూల లక్షణాలు కనిపించకపోతేనే కొనసాగించాలి.

Hair dye

జుట్టుకు రంగు వేసుకునేందుకు రెండు రోజుల ముందు తలస్నానం చేసి, మంచి కండీషనర్ ఉపయోగించాలి. అలాగే, డై వేసే ముందు ముఖానికి, తల మాడుకు మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల చర్మం రసాయనాల ప్రభావం నుంచి రక్షించబడుతుంది.

రంగు ఎక్కువ రోజులు ఉండాలంటే తరచూ తలస్నానం చేయకూడదు. ఎండ నుంచి జుట్టును కాపాడుకోవడానికి స్కార్ఫ్ లేదా టోపీని ఉపయోగించాలి. యూవీ కిరణాల వల్ల రంగు త్వరగా పోవడంతో పాటు, జుట్టు కూడా దెబ్బతింటుంది.

రంగు వేసుకున్న కొన్ని రోజుల పాటు వేడి నీళ్లతో తలస్నానం చేయకూడదు. అలాగే, బ్లోడ్రైయింగ్, స్ట్రెయిటనింగ్ వంటివి వారం రోజుల పాటు మానుకోవడం మంచిది.

చివరగా, తెల్ల జుట్టు కనిపించగానే డీలా పడిపోవాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు తెల్లజుట్టు అనేది ఒక ఫ్యాషన్ ట్రెండ్. సెలబ్రిటీల నుంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల వరకు చాలామంది తెల్ల జుట్టును సహజంగా ఉంచుకుని, కొత్త ఫ్యాషన్ స్టేట్‌మెంట్ల్ ఇస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు.

Mushrooms: పుట్టగొడుగుల తింటే బరువు తగ్గుతారా?

Exit mobile version