Weight Loss
కొంతమంది ఎంత ఎక్సర్‌సైజ్ చేసినా, పక్కాగా డైట్ పాటించినా కూడా వెయిట్ (Weight Loss ) తగ్గకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి కారణం, సరైన నిద్ర లేకపోవడం కూడా కావచ్చంటున్నారు నిపుణులు.
నిద్ర లేకపోతే కొవ్వు ఎందుకు కరగదంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయట. మీరు తీసుకునే క్యాలరీలను తగ్గించుకుని డైట్‌లో ఉన్నా కూడా, రోజువారీ ఎక్సర్‌సైజులు చేస్తున్నా సరే… క్వాలిటీ స్లీప్ లేకపోతే, శరీరం అదనంగా ఉన్న కొవ్వును (Fat) కరిగించడంలో సక్సెస్ అవ్వదు అని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
ఒకే రకమైన డైట్‌ను ఫాలో అయిన వ్యక్తులపై చేసిన స్టడీ ప్రకారం… తక్కువ నిద్ర పోయినవాళ్లు, ఎక్కువ నిద్ర పోయినవాళ్ల కంటే 55% తక్కువ కొవ్వును మాత్రమే కోల్పోయారు. అంటే, డైట్ ఒక్కటే కాదు, నిద్ర కూడా వెయిట్ తగ్గించడంలో చాలా ముఖ్యం అని తెలుస్తోంది.
నిద్ర లేకపోతే బరువు పెరగడానికి కారణం చాలానే ఉన్నాయంటున్నారు నిపుణులు. సరిగ్గా నిద్ర లేకపోవడం అనేది చాలా కాలం (Long Term) కొనసాగితే, అది శరీరంలో కీలకమైన మార్పులకు కారణమవుతుందట.
హార్మోన్ల ఇబ్బంది.. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలోని సిర్కాడియన్ రిథమ్‌కు ఇబ్బంది కలిగి, హార్మోన్ల బ్యాలెన్స్ దెబ్బతింటుంది.
ఆకలి పెరగడం.. ఆకలిని పెంచే ఘ్రెలిన్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో ఆకలి ఎక్కువగా వేస్తుంది.
ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ కూడా పెరుగుతుంది. ఈ హార్మోన్ పెరిగినప్పుడు, మెదడు శరీరం నుంచి కొవ్వును స్టోర్ చేయమని సంకేతాలు పంపుతుంది.
నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి, కొవ్వు సరిగ్గా జీర్ణం కాకుండా పోతుంది.
ఈ కారణాలన్నీ కలిసి, ఎక్కువ తినడానికి దారితీసి, వెయిట్ పెరగడానికి కారణమవుతాయి. అందుకే, ఆరోగ్యంగా ఉండాలన్నా, వెయిట్ తగ్గాలన్నా(Weight Loss)… ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల మంచి నిద్ర కచ్చితంగా అవసరమని నిపుణులు సలహా ఇస్తున్నారు.
