Beauty of your skin
మీ మేకప్ బ్యాగ్‌లో పదుల సంఖ్యలో క్రీములు, పౌడర్‌లు, సీరమ్‌లు,లోషన్లు ఉన్నాయా? అయితే, మీరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండీగా మారుతున్న “స్కినిమలిజం” (Skinimalism) అనే కాన్సెప్ట్‌కు భిన్నంగా ఉన్నట్లే. స్కినిమలిజం అనేది కేవలం తక్కువ మేకప్ వాడటం కాదు, మీ చర్మం యొక్క సహజ సౌందర్యాన్ని(beauty of your skin) హైలైట్ చేస్తూ, దాని ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టే ఒక నూతన జీవన విధానం.
అసలు స్కినిమలిజం అంటే ఏంటి అంటే స్కినిమలిజం అనేది రెండు ముఖ్యమైన పదాల కలయిక. స్కిన్ కేర్ (Skin Care) ,మినిమలిజం (Minimalism). చర్మ సంరక్షణ కోసం , అలంకరణ కోసం ఎక్కువ ఉత్పత్తులు వాడకుండా, కేవలం కొన్ని, అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను (Few, High-Quality Products) మాత్రమే వినియోగించడం. ఈ ట్రెండ్ యొక్క ప్రధాన లక్ష్యం.. చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలి, దానిని మేకప్‌తో కప్పిపుచ్చకూడదు.
చర్మ సంరక్షణ(Beauty of your skin)లో అతిగా ఉత్పత్తులు వాడితే వచ్చే సమస్యలు వస్తాయి. కొంతమంది తమ చర్మ సంరక్షణ రొటీన్‌లో దాదాపు 10 నుంచి 15 రకాల ఉత్పత్తులను వాడతారు. దీన్ని ‘కొరియన్ 10-స్టెప్ రూటీన్’ వంటి పేర్లతో పాటిస్తారు. ఈ అతి వినియోగం వలన చర్మంపై ఎక్కువ రసాయనాలు పేరుకుపోవడం వలన చర్మ రంధ్రాలు (Pores) మూసుకుపోయి మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు వస్తాయి.
వివిధ రకాల కెమికల్స్‌ను ఒకేసారి వాడటం వలన చర్మం సున్నితంగా మారి, ఎరుపు రంగులోకి మారడం లేదా అలర్జీలు రావడం జరుగుతుంది.అలాగే ఎక్కువ ఉత్పత్తులకు డబ్బు ఖర్చు పెట్టడమే కాక, ఉదయం , సాయంత్రం వాటిని వాడటానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది.
స్కినిమలిజం ట్రెండ్ ఎందుకు ప్రజాదరణ పొందుతోంది అంటే తక్కువ, సురక్షితమైన ఉత్పత్తులు వాడటం వలన చర్మానికి విశ్రాంతి దొరికి, దాని సహజ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఒకేసారి పదుల సంఖ్యలో ఉత్పత్తులు కొనాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఉత్పత్తులే అయినా, వాటిని కొనేటప్పుడు అత్యుత్తమ నాణ్యత ఉన్నవాటిని మాత్రమే కొనుగోలు చేస్తారు. ఇది దీర్ఘకాలంలో డబ్బును ఆదా చేస్తుంది.
మేకప్ వెనుక దాక్కోవడానికి బదులుగా, మీ చర్మాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం నేర్చుకుంటారు. సహజమైన కాంతి (Natural Glow) తోనే అందంగా కనిపించే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
తక్కువ ఉత్పత్తులు కొనడం అంటే, తక్కువ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ,తక్కువ రసాయనాలు వాతావరణంలోకి విడుదల అవ్వడం.
కనిష్ట అలంకరణ జీవనం ఎలా మొదలుపెట్టాలి?.. మీ రోజూవారీ రూటీన్‌లో తప్పనిసరిగా(Beauty of your skin) ఉండాల్సిన మూడు ఉత్పత్తులను ఎంచుకోండి: మైల్డ్ క్లీన్సర్, నాణ్యమైన మాయిశ్చరైజర్, మరియు విధిగా సన్‌స్క్రీన్.
ఫౌండేషన్, సన్‌స్క్రీన్ , మాయిశ్చరైజర్‌గా పనిచేసే BB క్రీములు లేదా CC క్రీములు వంటి మల్టీ-ఫంక్షనల్ ఉత్పత్తులను వాడండి.
ఫుల్ కవరేజ్ ఫౌండేషన్‌కు బదులుగా, కేవలం మచ్చలు ఉన్నచోట మాత్రమే కన్సీలర్‌ను వాడండి. పెదవులకు లిప్‌స్టిక్‌కు బదులుగా కలర్డ్ లిప్ బామ్‌ను వాడండి. కనుబొమ్మలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.
స్కినిమలిజం అనేది ఒక తాత్కాలిక ట్రెండ్‌గా మాత్రమే కాకుండా, మన చర్మాన్ని ప్రేమించడానికి, అంగీకరించడానికి సహాయపడే ఒక జీవన ఫిలాసఫీగా మారుతోంది. ఇది మన చర్మంపై రసాయనాల భారాన్ని, జేబుపై ఆర్థిక భారాన్ని రెండింటినీ తగ్గిస్తుంది.
