Liver Damage
ఒక చిన్న ప్రశ్నకు వచ్చిన సమాధానం ఇప్పుడు లక్షల మందికి హెచ్చరికలా మారింది. పార్లమెంట్‌లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఇచ్చిన సమాధానం.. దేశ వ్యాప్తంగా యువతలో కలవరానికి కారణమైంది. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో 84 శాతం మంది ఫ్యాటీ లివర్(Liver Damage) వ్యాధి ముప్పులో ఉన్నట్టు ఆయన అధికారికంగా వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అవును… కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నవాళ్లు ఇప్పుడు ఆరోగ్య సమస్యల అంచున నిలబడ్డారు. వారిని సైలెంట్ కిల్లర్ ఫ్యాటీ లివర్ (Liver Damage)వ్యాధి. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో ఏకంగా 84 శాతం మందికి ఈ జబ్బు ముప్పుగా మారిందన్న వార్త కలవరపెడుతోంది. ఇది ఒక్క గణాంకం కాదు… ఇది ఒక ఆందోళన గాథ.
పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చేసిన ప్రకటన చలించేదే. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన వెల్లడించిన అధ్యయనం వివరాలు నిజంగా ఊపిరి ఆపేస్తున్నాయి. ఒకేచోట కూర్చుని పనిచేయడం, ఫాస్ట్ ఫుడ్, వరస్ట్ లైఫ్ స్టైల్, మద్యం వంటి అలవాట్లు యవ్వనాన్ని ఫ్యాటీ లివర్ ముప్పును బయటపెడుతోంది.
ఈ అధ్యయన ప్రకారం…
👉 84 శాతం ఐటీ ఉద్యోగులకు ఫ్యాటీ లివర్ ముప్పు(Liver Damage)
👉 71 శాతం మందిలో ఊబకాయం
👉 34 శాతం మందిలో మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలు
👉 మూడింట ఒక వంతుకిపైగా జీవక్రియ సమస్యలతో బాధపడుతున్నారు.
వీరు భవిష్యత్‌లో డయాబెటిస్, గుండెపోటు వంటి బారిన పడతారని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) అధ్యయనం ప్రకారం, పట్టణాల్లో కాదు. రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ వ్యాధి ఇంకా 37.19 శాతం ఎక్కువగా ఉంది.
ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే… ఐటీ ఉద్యోగుల పని ధోరణే ఈ సమస్యలకు కారణమవుతోంది. 10-12 గంటలు కదలకుండా కుర్చీలో కూర్చోవడం, నిత్యం ఒత్తిడిలో బ్రతకడం, బయట తినే అలవాట్లు — ఇవే ముఖ్య కారణాలని అధ్యయనం తేల్చింది.
అందుకే ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం, ఆయుష్ మంత్రిత్వ శాఖ.. ‘యోగా బ్రేక్’ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ప్రతి ఉద్యోగి రోజూ ఐదు నిమిషాలు యోగా, ప్రాణాయామం చేయాలని సూచిస్తోంది. శారీరకంగా కాదు… మానసికంగా కూడా రిలీఫ్ పొందడానికిది ఇది మంచిదని చెబుతోంది.
మరోవైపు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వెంటనే స్పందించి, ఉద్యోగుల్లో స్క్రీనింగ్ చేసి, అవసరమైన ట్రీట్మెంట్ అందించాలన్నదే కేంద్ర సూచన. కాలేయ ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇప్పటికే మీడియా ద్వారా ప్రచారం సాగుతోందని కేంద్రం స్పష్టం చేసింది.
అందుకే ఐటీ ఉద్యోగులు, డెస్క్ జాబ్ చేసేవాళ్లు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. రెగ్యులర్‌గా వ్యాయామం. ఆహార నియమాలు పాటించడం, వెయిట్ పెరగకుండా జాగ్రత్త పడితే చాలు..ఫ్యాటీ లివర్ లాంటి భయంకరమైన జబ్బులకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు.
Also Read: heart attack : గుండెపోటుకు ముందు శరీరంలో కనిపించే ఐదు లక్షణాలు ..