heart attack : గుండెపోటుకు ముందు శరీరంలో కనిపించే ఐదు లక్షణాలు ..
heart attack : గుండెపోటు(heart attack) చాలా అకస్మాత్తుగా వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి, అది సంభవించే ముందు శరీరం కొన్ని ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది.

heart attack : గుండెపోటు అనేది చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం, ఏటా దాదాపు 17.9 మిలియన్ల మంది గుండె సంబంధిత సమస్యలతో చనిపోతున్నారు. ప్రతి ఐదు గుండెపోటు మరణాలలో నాలుగు, గుండెకు రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడటం వల్ల సంభవిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
heart attack
గుండెపోటు(heart attack) చాలా అకస్మాత్తుగా వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి, అది సంభవించే ముందు శరీరం కొన్ని ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది. వాటిని సరైన సమయంలో గుర్తించగలిగితే, మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు, సకాలంలో చికిత్స పొంది మళ్లీ ఆరోగ్యంగా మారవచ్చు. ఏ కారణం లేకుండా శరీరంలోని ఏదైనా భాగంలో నొప్పి లేదా అసౌకర్యం అనిపిస్తే దాన్ని తేలికగా తీసుకోకూడదు. ముఖ్యంగా, ఇలాంటి నొప్పులను సాధారణంగా భావించి పెయిన్‌కిల్లర్స్‌తో అణచివేయడం ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గుండెపోటుకు అత్యంత సాధారణ లక్షణం ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి. ఈ నొప్పి ఒక్కసారిగా మొదలై నిరంతరం ఉండొచ్చు. ఛాతీపై భారీ బరువు మోపినట్లు, లేదా ఎవరైనా గట్టిగా నొక్కుతున్నట్లు అనిపించవచ్చు. కొందరిలో ఇది తీవ్రంగా, మరికొందరిలో తేలికపాటి ఒత్తిడిలా ఉండొచ్చు. ఏది ఏమైనా, ఛాతీలో ఏదైనా అసౌకర్యాన్ని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు.
భుజాలు, మెడ లేదా వెన్ను నొప్పి కూడా గుండెపోటుకు సంకేతమే. ముఖ్యంగా ఛాతీ నొప్పితో పాటు ఈ ప్రాంతాలలో నొప్పి వస్తే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఈ నొప్పి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వ్యాపిస్తుంది. కొన్నిసార్లు ఒక వైపు, మరికొన్నిసార్లు రెండు వైపులా కూడా ఈ నొప్పి రావచ్చు.
ఎడమ చేయి నొప్పి(Shoulder Pain) గుండెపోటుకు ఒక క్లాసిక్ లక్షణం. ఈ నొప్పి ఆకస్మికంగా మొదలై తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు ఇది తేలికపాటి నొప్పిగా లేదా అసౌకర్యంగా అనిపించినా, చాలా కాలం పాటు కొనసాగితే దీన్ని విస్మరించకూడదు. ఈ నొప్పి చేతిలో జలదరింపు లేదా తిమ్మిరిగా కూడా అనిపించవచ్చు.
గుండెపోటు లక్షణాలు దవడ లేదా దంతాలలో నొప్పి(Jaw Pain)ని కూడా కలిగి ఉండవచ్చు. ఈ నొప్పి కేవలం దవడలోనే కాకుండా చెంపలు, పైభాగం వరకు కూడా వ్యాపించవచ్చు. కొన్నిసార్లు ఒక వైపు మాత్రమే తీవ్రమైన నొప్పిగా వస్తుంది. దంత సమస్యలు లేకపోయినా, ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా నొప్పి వస్తే దాన్ని తేలికగా తీసుకోకూడదు.
ఊపిరి ఆడకపోవడం అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ,విపరీతమైన అలసట కూడా గుండెపోటుకు కీలక సంకేతాలు. చాలా మంది ఈ లక్షణాలను సాధారణ అలసటగానో, ఒత్తిడి వల్లనో భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ, చిన్న పని చేసినా తీవ్రంగా అలసిపోవడం, ఎటువంటి శారీరక శ్రమ లేకుండానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వంటివి చాలా కాలం పాటు కొనసాగితే, అది గుండెపోటుకు ముందు వచ్చే ప్రమాద సంకేతం కావచ్చు.
ఈ లక్షణాలు(Symptoms) కనిపించినప్పుడు, సొంత వైద్యం చేసుకోకుండా, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ద్వారా మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఆరోగ్యం విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకం కావచ్చు.